అల్లు శిరీష్ 'ఎబిసిడి' వాయిదా.. మరో మెగా హీరోతో పోటీ!

మెగా హీరో అల్లు శిరీష్ ఈ సారి 'ఎబిసిడి' అంటూ రాబోతున్నాడు. ఎబిసిడి అనేది మలయాళంలో ఘనవిజయం సాధించిన చిత్రం. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఎబిసిడి.. అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి రాజీవ్ రెడ్డి దర్శత్వం వహిస్తున్నారు. రుక్సార్ దిల్లోన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో విజయం అందుకున్న శిరీష్ తదుపరి చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

మార్చి 21న విడుదల కావాల్సిన ఎబిసిడి చిత్రం వాయిదా పడ్డట్లు సమాచారం. పోస్టే ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం జరుగుతుండంతో నిర్మాతలు చిత్రాన్ని వాయిదా వేసినట్లు జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏప్రిల్ 12న విడుదల కావడం ఖరారైతే అల్లు శిరీష్ మరో మెగా హీరోతో పోటీ పడవలసి ఉంటుంది.

Allu Sirish ABCD release postponed to April

సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రలహరి చిత్రం కూడా ఏప్రిల్ 12నే విడుదల కానుంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు శిరీష్ ఇంతవరకు టాలీవుడ్ లో తనదైన ముద్ర వేయలేదు. ఎబిసిడి చిత్రం తనకు మరింత గుర్తింపు తీసుకువస్తుందని శిరీష్ భావిస్తున్నాడు. మధుర శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జుడా శాండీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X