అద్దం చాటున అల్లు శిరీష్ లిప్ లాక్.. ఆ మూడ్‌లో ఆమె కూడా రెచ్చిపోయిందిగా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు. ఎన్నో రకాలుగా విభిన్నంగా ట్రై చేస్తున్నప్పటికీ కూడా అదృష్టం కలిసి రావడం లేదు. రెగ్యులర్ సినిమాలు చేయకుండా బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి వర్కౌట్ అవ్వడం లేదు. అందుకే ఈ స్టార్ యాక్టర్ మరింత కొత్తగా ట్రై చేసేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేయగా అందులో నెవర్ బిఫోర్ అనేలా దర్శనమిచ్చాడు.

ఆలోచనలో పడిన అల్లు అరవింద్

ఆలోచనలో పడిన అల్లు అరవింద్

సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ ఇప్పటికే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా కొత్త తరహా బ్రాండ్ సెట్ చేసుకున్నాడు. పాన్ ఇండియా సినిమా కూడా చేస్తున్నాడు. కానీ చిన్న కొడుకు అల్లు శిరీష్ మాత్రం ఇంతవరకు అనుకున్నంత స్థాయిలో హిట్ అందుకోకపోవడంతో కొంత ఆలోచనలో పడ్డారు. ఎలాగైనా అతనికి హిట్టివ్వాలని అనేక రకాల కథలు వింటున్నారు.

ఎలాంటి సినిమా చేసినా..

ఎలాంటి సినిమా చేసినా..

అల్లు శిరీష్ మొదటి సినిమా గౌరవం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా ఏ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. కేవలం శ్రీరస్తు శుభమస్తు మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది. ఆ సినిమాను పరశురామ్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక చివరగా చేసిన ABCD మంచి రీమేక్ కథ అయినప్పటికి అదృష్టం వరించలేదు.

ఫిట్నెస్ లో మార్పులు

ఫిట్నెస్ లో మార్పులు

ఎలాంటి సినిమా చేసినా కూడా అల్లు శిరీష్ కు ఫెయిల్యూర్ అనేది కామన్ గా వస్తోంది. అందుకే ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని డిఫరెంట్ గా రెడీ అవుతున్నాడు. ఇటీవల ఫీట్నెస్ లో మార్పులు తెచ్చిన విషయం తెలిసిందే. ఏకంగా సిక్స్ ప్యాక్ తో షాక్ ఇచ్చాడు. మొదటిసారి అలా కనిపించడంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.

Recommended Video

Anu Emmanuel In Bellamkonda And Santhosh Srinivas's Next Movie
అద్దం చాటున లిప్ లాక్...

అద్దం చాటున లిప్ లాక్...

ఇక అల్లు శిరీష్ ఇటీవల తన కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశాడు. అందులో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌ ను అద్దం చాటున ముద్దు పెడుతున్నట్లు ఉంది.

ఇప్పటివరకు రొమాన్స్ జోలికి పెద్దగా వెళ్ళని శిరీష్ మొదటిసారి లిప్ లాక్ తో షాక్ ఇచ్చేలా ఉన్నాడని అర్ధమవుతోంది. ఇక సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ ను మే 30న శిరీష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. GA2 ప్రొడక్షన్ లో రానున్న ఆ సినిమాను రాకేష్ శశి డైరెక్ట్ చేయనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X