Allu Sirish- Nayanika: అల్లు శిరీష్- నయనిక వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్.. ఐకానిక్ ప్లేస్‌లో స్టార్ కపుల్!

ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఘనంగా జరుపుకున్నారు. యువతీ యువకులు తమ మనసులోని మాటను తమ ప్రేమికులతో చెబుతుండగా.. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు తమ లవర్స్‌తో కలిసి వాలంటైన్స్ డే వేడుకలు జరుపుకున్నారు. ఇక త్వరలో పెళ్లి పీటలెక్కనున్న లవ్ బర్డ్స్... ప్రేమికులుగా చివరి వాలంటైన్స్ డేను జరుపుకున్నారు. ఈ క్రమంలో మెగా హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు, కాబోయే భార్య నయనిక రెడ్డితో కలిసి ప్రేమికుల దినోత్సవాన్ని గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు.. అల్లు శిరీష్ - నయనిక రెడ్డిలు మార్చి 6న వివాహ బంధం ద్వారా ఒక్కటి కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు కుటుంబాల్లోనూ పెళ్లి పనులను అధికారికంగా మొదలుపెట్టేశారు. ఫిబ్రవరి 13న అల్లు అరవింద్ నివాసంలో పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. మెగా- అల్లు కుటుంబాలతో పాటు పలువురు బంధుమిత్రులు, సన్నిహితులు ఆ కార్యక్రమాలో పాల్గొని అల్లు శిరీష్‌ను ఆశీర్వదించారు.

Allu Sirish Celebrates Valentine s Day with Fianc e Nayanika Reddy at Eiffel Tower Ahead of Wedding

మరోవైపు ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు వ్యక్తిగత కారణాలతో గైర్హాజరయ్యారు. అయితే శిరీష్ అన్నయ్య, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. అట్లీ దర్శకత్వంలో చేస్తోన్న మూవీ షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతంలో ఉండటంతో అల్లు అర్జున్ తన ఇంట్లో కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్. అయితే తాను ఈ కార్యక్రమానికి మిస్ అయ్యానంటూ అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ఇకపోతే.. పెళ్లికి కొద్దిరోజుల ముందే అల్లు శిరీష్ - నయనికలు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో సందడి చేశారు. దుబాయ్ బీచ్‌లోని ఓ లగ్జరీ షిప్‌లో ఈ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలకు అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు బాబీతో పాటు శిరీష్, నయనికల స్నేహితులు పాల్గొన్నారు. షాంపేన్ బాటిల్ పొంగిస్తూ బన్నీ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక ఆయన వేసుకొచ్చిన షర్ట్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అలా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను ఆనందోత్సాహాల మధ్య ముగించారు అల్లు శిరీష్ - నయనిక.

కాగా.. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం శిరీష్ - నయనికలకు ఎంతో స్పెషల్. మరికొద్దిరోజుల్లో భార్యాభర్తలుగా ఒక్కటి కానున్న నేపథ్యంలో ఇది ప్రేమికులుగా వారికి ఇదే చివరి వాలంటైన్స్ డే. అంతకుముందు ప్రేయసి ప్రియుడిగా ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్న వీరు.. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవాన్ని చిరస్మరణీయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా ఫారిన్ ట్రిప్ వేశారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద శిరీష్ - నయనికలు ఈ వేడుకలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను శిరీష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఫ్రాన్స్ వీధుల్లో చక్కర్లు కొట్టడంతో పాటు ఓ తాళంపై శిరీష్, నయనికల పేర్లు రాసి అక్కడ లాక్ చేశారు. అలాగే తనకు కాబోయే భార్యకు క్యూటేష్ అని ముద్దుపేరు పెట్టుకున్నారు శిరీష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. లైఫ్ లాంగ్ ఇలాగే అన్యోన్యంగా ఉండాలంటూ నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

More from Filmibeat

Read more about: allu sirish Nayanika allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X