నాని దుమ్ములేపాడు.. V చిత్రంపై అల్లు శిరీష్ కామెంట్స్
ప్రస్తుత కాలంలో తెలుగులో V చిత్రం చేసిన హంగామా ఇంకే చిత్రం చేసి ఉండదు. ఓటీటీ కాకుండా థియేటర్లలోనే రిలీజ్ చేద్దామని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ కాలం సహకరించకపోవడం, కరోనా తగ్గకపోవడంతో అమెజాన్‌లో రిలీజ్ చేసేశారు. భారీ అంచనాలున్న పెద్ద చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో బాగానే హైప్ వచ్చింది. అయితే సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో అందరూ నిరాశపడ్డారు. తాజాగా ఈ చిత్రంపై అల్లు శిరీష్ కామెంట్ చేశాడు.
వీ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ ముందుక వచ్చారు. రాజమౌళి ఫ్యామిలీ మొత్తం సినిమాను వీక్షించారు. టాలీవుడ్ ప్రముఖులు వీ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. అయితే ప్రేక్షకులకు మాత్రం అంతగా ఎక్కలేదు. ఇక సినిమాపై అంచనాలు తలకిందులు కావడం ఒకెత్తు అయితే.. సినిమాకు తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం మరింత నెగెటివ్ అయింది. ఇక తాజాగా అల్లు శిరీష్ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాను థియేటర్లో చూడటం మిస్ అయ్యాను. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా చూడటం ఆనందంగా ఉంది. నాని ఆ క్యారెక్టర్‌ను అద్భుతంగా పోషించాడు. సూపర్ యాక్షన్ సీక్వెన్స్, ఎన్నో ట్విస్ట్‌లు, నటనతో వీ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించింది యూనిట్. మిస్ కాకండి గాయ్స్.. సుధీర్ బాబు పెట్టిన ఎఫర్ట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.నీకు గాయాలైన వీడియోలు కూడా చూశాను.. అయినా సరే పాత్ర కోసం ఎంతో కష్టపడ్డావు.. ఆ డెడికేషన్‌తో మమ్మల్ని ఇన్‌స్పైర్ చేశావ్ అంటూ ప్రశంసలు కురిపించాడు.


Click it and Unblock the Notifications











