Allu Sirish Marriage : అల్లు శిరీష్- నయనిక పెళ్లి డేట్ ఫిక్స్.. పిల్లలతో స్పెషల్ వీడియో..
Allu Sirish-Nayanika Marriage: అల్లు కుటుంబంలో త్వరలో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. అల్లు అరవింద్ తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ (Allu Sirish) త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే తన ప్రియురాలు నయనిక (Nayanika)తో అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న శిరీష్, తాజాగా తన పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించారు. శిరీష్ తన పెళ్లి డేట్‌ను చెప్పిన విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ పెళ్లి ఎప్పుడంటే?
అల్లు శిరీష్ తన అన్న అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఓ ట్రెండింగ్ పాటకు రీల్ చేస్తూ.. తమ వివాహం 2026 మార్చి 6న జరగనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. శిరీష్ తన పెళ్లి డేట్‌ను చెప్పిన విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రకటనతో అల్లు ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాలు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నాయి.ఈ వీడియోలో పిల్లలు 'బాబాయ్ మీ పెళ్లి ఎప్పుడు?' అని అడగగా, 'మార్చి 6' అని శిరీష్ సమాధానం ఇవ్వడం అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాదు, 'సంగీత్ ఎప్పుడు?' అనే ప్రశ్నకు 'మనం సౌత్ ఇండియన్స్ కదా... అలాంటివి చేయం'అంటూ సరదాగా చెప్పడం వీడియోకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది. ఈ ఫన్ రీల్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... అల్లు అర్జున్ - స్నేహారెడ్డి వివాహం కూడా 2011 మార్చి 6న జరగడం. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత అదే తేదీన అల్లు శిరీష్ పెళ్లి జరగడం విశేషంగా మారింది. ఈ డేట్ అల్లు ఫ్యామిలీకి లక్కీ డేట్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 'మార్చి 6 అల్లువారి ఇంట పండుగ' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
శిరీష్ - నయనికల ప్రేమకథ కూడా ఆసక్తికరంగా ఉంది. వీరిద్దరి పరిచయం వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి వివాహ వేడుకల సమయంలో మొదలైంది. ఆ సమయంలో యంగ్ హీరో నితిన్, ఆయన సతీమణి షాలిని కలిసి ఇచ్చిన పార్టీకి నయనిక కూడా హాజరయ్యారు. ఆమె షాలినికి ప్రాణ స్నేహితురాలు కావడంతో ఆ వేడుకలోనే శిరీష్ ఆమెను తొలిసారి కలిశారు. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారి, తరువాత ప్రేమగా మారిందని శిరీష్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'మా పిల్లలు ఎప్పుడైనా మా ప్రేమ ఎలా మొదలైంది అని అడిగితే, ఇదే కథ చెబుతాను. నన్ను తమ సర్కిల్‌లోకి తీసుకున్న నయనిక స్నేహితులందరికీ థాంక్స్' అని శిరీష్ చెప్పడం అప్పట్లో వైరల్ అయింది.
దాదాపు రెండేళ్ల పాటు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత, ఇరు కుటుంబాల అంగీకారంతో అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ఆ బంధాన్ని వివాహంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. పెళ్లి ఎక్కడ జరుగుతుంది అనే వివరాలను మాత్రం శిరీష్ ఇంకా వెల్లడించలేదు. అల్లు కుటుంబ సంప్రదాయానికి తగ్గట్టుగా సింపుల్‌గా, కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే వివాహం జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. పెళ్లికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











