కేరళలో అల్లు శిరీశ్‌కు క్రేజీ అవార్డు.. మోహన్‌లాల్‌తో కలిసి..
టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్‌కు ప్రత్యేకమైన గౌరవం దక్కింది. కేరళవాసులు క్రాస్‌ఓవర్ స్టార్ ఆఫ్ ది ఇయర్ ఫర్ లులూ ఫ్యాషన్ వీక్ 2019 అవార్డు దక్కింది. కోచిలో జరిగిన అవార్డుల వేడుకల్లో ఈ అవార్డును శిరీష్‌కు అందజేశారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి 1971 చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు శిరీష్ నటనను ప్రశంసిస్తూ ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
టాలీవుడ్ హీరో ఈ అవార్డును అందుకోవడం ఇదే తొలిసారి. ఈ అవార్డు అల్లు శిరీష్ అందుకోవడంపై సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు. ఇదిలా ఉండగా, అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ.. అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ అనే సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ చూరగొంటున్నాయి.

మలయాళంలో సూపర్‌హిట్ సాధించిన చిత్రాన్ని తెలుగులో మధుర శ్రీ్ధర్‌రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి సురేష్‌బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంజీవ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాబ్రదర్ నాగబాబు అల్లు శిరీష్‌కు తండ్రి పాత్రలో నటిస్తున్నారు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.


Click it and Unblock the Notifications











