Allu Sirish- Nayanika Wedding: చిరంజీవికే మొదటి శుభలేఖ.. మామయ్యకు ప్రేమతో అల్లు శిరీష్

మెగా ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్‌తో నయనిక రెడ్డి వివాహం మార్చి 6వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌తో వధూవరులిద్దరూ ఎంజాయ్ చేశారు. ఇటీవల అల్లు అరవింద్ కుటుంబం పసుపు దంచుడు కార్యక్రమంతో అధికారికంగా పెళ్లి పనులు ప్రారంభించింది. తాజాగా తన మేనమామ, మెగాస్టార్ చిరంజీవి పట్ల అభిమానాన్ని చాటుకున్నారు అల్లు శిరీష్. ఈ వివరాల్లోకి వెళితే..

ఎక్కడో మారుమూల గ్రామంలో ఓ సామాన్య కుటుంబంలో పుట్టి తెలుగు తెరకు మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. కృషి, పట్టుదల, క్రమశిక్షణ, ప్రతిభ వంటి ఎంతటి సామాన్యుడైనా అసాధారణ స్థాయికి రావొచ్చని నిరూపించి కోట్లాదిమందికి ఆదర్శంగా నిలిచారు చిరంజీవి. ఎంతో కష్టపడి మెగా సామ్రాజ్యాన్ని నిర్మించి తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి చేరుకున్నారు. చిరంజీవి వేసిన బాటలో మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిథరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్‌లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

Allu Sirish Invites Chiranjeevi First for His Wedding with Nayanika Mega Family Bond Goes Viral

ఫ్యామిలీయే చిరంజీవి బలం
ఒక్క మెగా ఫ్యామిలీలోనే డజను మంది హీరోలు ఉండగా.. మెగా డాటర్స్ సుస్మిత కొణిదెల, నిహారిక కొణిదెలలు నిర్మాతలుగా రాణిస్తున్నారు. వీరందరికీ మార్గదర్శిగా, వెన్నెముకగా నిలబడి ముందుకు నడిపిస్తున్నారు చిరంజీవి. కుటుంబం ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని బలంగా నమ్ముతారు మెగాస్టార్. మెగా ఫ్యామిలీలో ఏ పండుగ జరిగినా, ఏ శుభకార్యం జరిగినా అందరూ హాజరయ్యేలా చొరవ తీసుకుంటున్నారు చిరు. ఆయన వేసిన బలమైన పునాదులు మెగా ఫ్యామిలీని ముందుకు నడిపిస్తున్నాయి.

మామయ్యే నా రోల్ మోడల్
కొత్త పెళ్లి కొడుకు అల్లు శిరీష్ కూడా ఎన్నోసార్లు తన మేనమామ చిరంజీవి పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. ఓ సందర్భంలో చిరు గురించి శిరీష్ మాట్లాడుతూ.. తనను పెంచింది చిరంజీవి గారే. ఆయన ఎంతో ఎమోషనల్, ఎంత మంచివారంటే తనకు ప్రతిదానిలో రోల్ మోడల్. మా ఇంట్లో ఉన్న పిల్లలకి ఆయనలాంటి అంకుల్ కావాలని అనుకుంటున్నా.. పెద్దయ్యాక ఆయనలాంటి భర్త కావాలని అనుకుంటున్నా.. నాకు బావమరిది ఉంటే అలాంటి బావ అవ్వాలని అనుకుంటున్నా.. ఆయన దారిలోనే సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనుకుంటున్నా. మావయ్య బాగా సెన్సిటివ్ పర్సన్.. ఆయనొక మహా సముద్రం, ఆయన గురించి ఏం చెప్పగలను. చిన్నప్పటి నుంచి మా నాన్న కంటే మా మావయ్యే నన్ను ఎక్కువగా ఫారిన్ ట్రిప్స్‌కి తీసుకెళ్లారు. నా బర్త్ డే రోజు రాత్రి 12 గంటలకు మా డాడీ మరిచిపోతారేమో కానీ పొద్దున్నే 8 గంటలకి మా మావయ్య ఖచ్చితంగా ఫోన్ చేస్తారని అల్లు శిరీష్ ఎమోషనల్ అయ్యారు.

తొలి శుభలేఖ మామయ్యకే
త్వరలో నయనికను పెళ్లాడబోతున్న అల్లు శిరీష్ తాజాగా తన మావయ్య చిరంజీవి పట్ల మరోసారి అభిమానాన్ని చాటుకున్నారు. మార్చి 6వ తేదీన జరగనున్న తన వివాహానికి సంబంధించి పెళ్లి పత్రికలు పంచే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా తొలి పెళ్లి పత్రికను చిరంజీవి కుటుంబానికే అందజేసింది అల్లు ఫ్యామిలీ. ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి తన తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మలతో కలిసి వెళ్లిన అల్లు శిరీష్.. తొలి ఆహ్వాన పత్రికను చిరంజీవి - సురేఖ దంపతులకు అందజేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను శిరీష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికను మా మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖలకు అందజేశామని శిరీష్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుండగా .. ఇందులో చిరంజీవి మోచేతికి షోల్డర్ బ్యాగ్‌తో కనిపించడంతో ఆయనకు ఏమైంది? ఏమైనా సర్జరీ జరిగిందా? అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: allu sirish chiranjeevi Nayanika
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X