అల్లు శిరీష్- నైనిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ .. స్పెషల్ అట్రాక్షన్‌గా అల్లు అర్జున్..
Allu Sirish-Nayanika Pre-Wedding Celebrations: అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన స్నేహితురాలు, ప్రేయసి నైనికతో త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందే దుబాయ్ వేదికగా ఘనంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ గ్రాండ్ ఈవెంట్ కు కేవలం అల్లు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మాత్రమే హాజరు అయినట్టు తెలుస్తోంది.
అల్లు శిరీష్- నైనిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ దుబాయ్‌లోని ప్రఖ్యాత జే1 బీచ్ (J1 Beach) వేదికగా జరగడం విశేషం. సముద్ర అలల నడుమ లగ్జరీ బోటులో శిరీష్-నైనిక తమ స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. శిరీష్ షాంపైన్ బాటిల్ ఓపెన్ చేసి ఆనందాన్ని పంచుకోగా, ఆ క్షణాలు వీడియోలుగా మారి నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

స్పెషల్ అట్రాక్షన్‌గా ఐకాన్ స్టార్
ఈ వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించినది మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తమ్ముడి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు హాజరైన బన్నీ, ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో కలిసి సందడి చేశారు. శిరీష్ ఆనందాన్ని చూసి బన్నీ మురిసిపోయిన వీడియోలు అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. స్టైల్ విషయానికి వస్తే ఈ పార్టీలో బన్నీ లుక్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడూ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచే ఆయన, ఈసారి ధరించిన స్టైలిష్ షర్ట్‌తో అందరి చూపు తనవైపే తిప్పుకున్నారు. సింపుల్‌గా కనిపించినా, క్లాస్ అండ్ స్టైల్ గా ఉండటంతో బన్నీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
అల్లు ఫ్యామిలీ బాండింగ్ హైలైట్
ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో అల్లు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకంగా కనిపించింది. అన్నయ్య- తమ్ముడి మధ్య బాండింగ్, కుటుంబ సభ్యుల సంతోషం ఈ వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఇదే సమయంలో అల్లు అర్జున్ తన షూటింగ్ షెడ్యూల్ నుంచి చిన్న విరామం తీసుకుని ఈ సెలబ్రేషన్స్‌కు హాజరు అయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్ తన అన్నయ్య వదినతో దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.
ముహూర్తం అదే రోజు.. ప్రత్యేకత ఇదే!
అల్లు శిరీష్-నైనిక వివాహం 2026 మార్చి 6న జరగనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అదే రోజు అల్లు అర్జున్ -స్నేహారెడ్డిల పెళ్లి రోజు కూడా కావడం. అన్నయ్య మ్యారేజ్ డే రోజే తమ్ముడి వివాహం జరగడం అల్లు కుటుంబానికి చిరస్మరణీయ క్షణంగా మారనుంది. గతేడాది అక్టోబర్ 31న వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
దుబాయ్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌తో మొదలైన ఈ పెళ్లి సందడి, మార్చిలో హైదరాబాద్‌లో జరగనున్న గ్రాండ్ వెడ్డింగ్‌తో పీక్స్‌కు చేరనుంది. టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో, అల్లు శిరీష్-నైనిక వివాహం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు ఇప్పటినుంచే నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











