Allu Sirish Wedding: ప్రైవేట్ పార్టీలో అల్లు శిరీష్- నయనిక సందడి.. ఫోటోలు లీక్ చేసిన స్టార్ హీరో భార్య..
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. మూడేళ్లుగా తాను ప్రేమిస్తోన్న నయనిక రెడ్డిని పెద్దల అంగీకారంతో తన భార్యగా చేసుకోబోతున్నారు. మార్చి 6వ తేదీన హైదరాబాద్‌లో అల్లు శిరీష్- నయనిక రెడ్డిల వివాహం ఘనంగా జరగనుంది. ఈ వేడుకలకు సినీ, రాజకీయ, వ్యాపార తదితర రంగాలకు చెందిన ప్రముఖులు తరలిరానున్నారు. ఇటీవలే ఇరు కుటుంబాల్లో పెళ్లి వేడుకలు మొదలవ్వగా.. పెళ్లి పిలుపులు కూడా మొదలుపెట్టేశారు.
వరుణ్ తేజ్ - లావణ్యల వెడ్డింగ్ పార్టీలో తొలిసారిగా నయనికను చూశాడు శిరీష్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు.. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు శిరీష్. ఇద్దరి మధ్య నెమ్మదిగా పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఓ మంచి రోజు చూసుకుని ప్రియురాలికి తన మనసులోని మాటను చెప్పేశారు శిరీష్. దానికి నయనిక నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇద్దరూ మూడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఆ తర్వాత తమ ప్రేమ విషయాన్ని వీరిద్దరూ పెద్దలకు తెలియజేయగా.. రెండు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించి, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

గతేడాది అక్టోబర్ 31న అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో నయనిక వేలికి ఉంగరం తొడిగాడు శిరీష్. నాటి నుంచి ఈ జంట పెళ్లి ఎప్పుడు? ఇండియాలోనా? ఫారిన్‌లోనా? అంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. చివరికి మార్చి 6వ తేదీన అల్లు శిరీష్ - నయనికల పెళ్లి జరుగుతుందని ఇరు కుటుంబాలు ప్రకటించాయి. ఆరోజు అల్లు అర్జున్ - స్నేహారెడ్డిల పెళ్లి రోజు కావడం విశేషం. దాంతో మార్చి 6 అల్లు ఫ్యామిలీకి మరింత స్పెషల్ కానుంది.
త్వరలో పెళ్లి జరగనుండగా.. అల్లు శిరీష్- నయనిక రెడ్డిలు బ్యాచిలర్ పార్టీలు, ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌తో మునిగి తేలుతున్నారు. కొద్దిరోజుల క్రితం దుబాయ్‌లోని లగ్జరీ యాట్‌లో జరిగిన సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు బాబీతో పాటు బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో షాంపేన్ పొంగిస్తూ.. ఖరీదైన షర్ట్ ధరించి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు అల్లు అర్జున్. ఆ తర్వాత అల్లు అరవింద్ నివాసంలో పసుపు దంచే కార్యక్రమంతో శిరీష్ పెళ్లి వేడుకలు అధికారికంగా ప్రారంభించాయి. ఈ సందర్భంగా తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంపతులను శిరీష్ తన తల్లిదండ్రులతో కలిసి మొదటి శుభలేఖ అందించి పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
త్వరలో వివాహం నేపథ్యంలో అల్లు శిరీష్ - నయనికలు తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. ఇద్దరూ కలిసి పలు పార్టీలలు పాల్గొంటున్నారు. అలాగే ఇరు కుటుంబ సభ్యులు, వారి సన్నిహితులు కూడా పార్టీలు ఇస్తూ ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నారు. తాజాగా శిరీష్ - నయనికలు ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నారు. కేవలం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్న ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే ఇందులో ఎవరి ఫోటోలు లేవు.. గులాబీలతో అలంకరించిన వేదిక వద్ద షాంపేన్‌తో ఉన్న గ్లాసులను పేర్చి ఉన్న ఫోటోను మాత్రమే స్నేహారెడ్డి షేర్ చేశారు. ఈ పార్టీ ఎక్కడ జరుగుతోంది? హోస్ట్ ఎవరు అనేది మాత్రం తెలియరాలేదు. అయితే తమ్ముడి పెళ్లి సందర్భంగా అల్లు అర్జున్ ఓ ప్రైవేట్ పార్టీ ఇవ్వబోతున్నట్లుగా కొద్దిరోజుల క్రితం ఓ న్యూస్ హల్‌చల్ చేసింది. ఒకవేళ అదే నిజమైతే.. అల్లు అర్జున్ ఇస్తున్న పార్టీ తాలూకా ఫోటోనే స్నేహారెడ్డి షేర్ చేశారా? అంటూ ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











