Allu Sirish- Nayanika Wedding: అల్లు శిరీష్- నయనికల పెళ్లి... పవన్ కళ్యాణ్‌కు అల్లు అరవింద్ ఆహ్వానం

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ వివాహం నయనిక రెడ్డితో మార్చి 6వ తేదీన హైదరాబాద్‌లో జరగనుంది. దీంతో ఇరు కుటుంబాల్లోనూ పెళ్లి వేడుకలు మొదలైపోయాయి. ఇప్పటికే అల్లు అరవింద్ నివాసంలో పసుపు దంచే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి అధికారికంగా పెళ్లి పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే బంధువులు, సన్నిహితులు, ఇతర ప్రముఖలను పెళ్లికి ఆహ్వానించడంలో రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి.

నయనికతో గతేడాది ఎంగేజ్‌మెంట్
నయనిక రెడ్డితో ప్రేమ విషయాన్ని గతేడాది బయటపెట్టిన అల్లు శిరీష్ అనంతరం పెద్దల అంగీకారంతో ఆమె వేలికి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉంగరం తొడిగారు. నయనికతో పెళ్లి ఎప్పుడు? ఎక్కడ జరుగుతుంది? అనే ఊహాగానాలకు చెక్ పెడుతూ ఇండియాలోనే అది కూడా హైదరాబాద్‌లోని అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల పెళ్లి జరుగుతుందని ఇరు కుటుంబాలు ప్రకటించాయి. పెళ్లికి సమయం దగ్గరపడటంతో అల్లు శిరీష్ - నయనికలు బ్యాచిలర్ పార్టీలు, ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌తో బిజీగా ఉన్నారు.

Allu Sirish- Nayanika Wedding Allu Aravind invites Pawan Kalyan and Naga Babu for his son wedding

దుబాయ్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
కొద్దిరోజుల క్రితం దుబాయ్‌లోని ఓ లగ్జరీ యాట్‌లో శిరీష్ - నయనికల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. అల్లు కుటుంబ సభ్యులు, వధూవరుల సన్నిహితుల మధ్య ఈ పార్టీ గ్రాండ్‌గా జరిగింది. ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత అల్లు అరవింద్ నివాసంలో పసుపు దంచే కార్యక్రమంలో శిరీష్‌తో పాటు మెగా- అల్లు కుటుంబాలు, బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఆ తర్వాత తన తమ్ముడి పెళ్లి సందర్భంగా అల్లు అర్జున్ ఫిబ్రవరి 20వ తేదీన హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ పార్టీ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అలాగే హీరోయిన్లు శ్రీలీల, మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్ధుల్లా తదితరులు ఈ పార్టీలో సందడి చేశారు.

చిరంజీవికి తొలి శుభలేఖ
ఇక పెళ్లి పిలుపుల కార్యక్రమానికి కూడా అల్లు కుటుంబం శ్రీకారం చుట్టింది. ముందుగా తొలి పెళ్లి పత్రికను తన మేనమామ, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులకు అందజేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు శిరీష్. తెలుగు సాంప్రదాయం ప్రకారం తొలి శుభలేఖను మేనమామకు అందించినట్లు చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నారు శిరీష్. తాజాగా మెగాస్టార్ సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కూడా పెళ్లికి ఆహ్వానించారు అల్లు అరవింద్.

పవన్, నాగబాబులకు ఆహ్వానం
హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన శిరీష్.. మార్చి 6న జరగనున్న తన వివాహానికి హాజరుకావాల్సిందిగా శుభలేఖను, నూతన వస్త్రాలను అందించి పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నాలెజ్‌నోవాను ఆహ్వానించారు. అనంతరం చిరంజీవి మరో సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబును కూడా అల్లు అరవింద్ తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. నాగబాబు దంపతులకు పట్టువస్త్రాలు బహూకరించి శుభలేఖను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో అల్లు శిరీష్ పెళ్లిలో మెగా- అల్లు కుటుంబాల సందడి కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X