Allu Sirish Wedding: అల్లు అర్జున్ ప్రైవేట్ పార్టీ.. రూమర్లకు రాంచరణ్, ఉపాసన తెర!
Allu Sirish Wedding: అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ (Allu Sirish) వివాహ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. శిరీష్ తన ప్రేయసి నయనికను మార్చి 6న వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమవ్వగా, ఇటీవల దుబాయ్‌లో స్నేహితులతో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడి పెళ్లి సందర్భంగా హైదరాబాద్‌లో ప్రైవేట్ ప్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి మెగా-అల్లు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా రామ్ చరణ్ తన భార్య ఉపాపన తో కలిసి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో శిరీష్-నయనిక, అల్లు అర్జున్-స్నేహారెడ్డి, రామ్ చరణ్-ఉపాసన కలిసి దిగిన గ్రూప్ ఫోటో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

అందరూ బ్లాక్ డ్రెస్ కోడ్‌లో మెరిశారు. అలాగే చరణ్ మరోసారి అయ్యప్ప మాల ధరించి కనిపించడంతో అల్లు-మెగా ఫ్యాన్స్ ఆ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. ఇక ఈ పార్టీకి సంబంధించిన అతిథుల జాబితా కూడా వైరల్ అవుతోంది. మెగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు యంగ్ హీరోలు, హీరోయిన్లు హాజరైనట్లు సమాచారం.సినీ వర్గాల్లో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉండగా, శిరీష్-నయనిక పెళ్లి పిలుపులు కూడా మొదలయ్యాయి.తొలిగా మెగా కుటుంబ పెద్ద మెగాస్టార్ చిరంజీవి కి శుభలేఖ అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. అల్లు అరవింద్ దంపతులు చిరు కుటుంబానికి నూతన వస్త్రాలు అందించి అధికారికంగా ఆహ్వానించారు. ఇటీవల శిరీష్ ఇంట్లో పసుపు దంచే వేడుక కూడా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగా-అల్లు కుటుంబ సభ్యులు ఒకే చోట చేరి సందడి చేశారు. ఈ వీడియోను శిరీష్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరోవైపు, ఈ వేడుకల్లో ఉపాసన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత తొలిసారి ఆమె ఈ ఫ్యామిలీ ఫంక్షన్‌లో కనిపించడం విశేషం. ఇటీవలే తమ పిల్లలకు నామకరణం కూడా నిర్వహించారు. శిరీష్-నయనిక వివాహం మార్చి 6న జరగనుండగా, వేదిక వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశముందని టాక్. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు మెగా-అల్లు కుటుంబాన్ని ఒక్కచోట చేరడంతో దూరంగా ఉన్నారనే రూమార్స్ కు తెరపడినట్టు అయింది.


Click it and Unblock the Notifications











