Allu Sirish- Nayanika Wedding: అల్లు శిరీష్ - నయనిక పెళ్లి పనులు షురూ... పసుపు దంచిన అల్లు ఫ్యామిలీ!

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుటుంబంలో పెళ్లి భాజాలు మోగిన సంగతి తెలిసిందే. ఆయన చిన్న కుమారుడు అల్లు శిరీష్‌- నయనికల వివాహం మార్చి 6వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. తెలుగు సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు వీరి వివాహానికి తరలిరానున్నారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా అల్లు ఫ్యామిలీ పెళ్లి పనులు మొదలుపెట్టేసింది. ఈ వివరాల్లోకి వెళితే...

నయనిక రెడ్డి హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన యువతిగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. వీరి ఫ్యామిలీకి రియల్ ఎస్టేట్‌తో పాటు పలు బిజినెస్‌లు ఉన్నాయని.. హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుమించి నయనిక గురించి ఇతర వివరాలు తెలియరాలేదు. అయితే కొద్దిరోజుల క్రితం అల్లు శిరీష్ తన లవ్‌స్టోరీ ఎప్పుడు? ఎక్కడ? ఎలా? మొదలైంది అనే దానిపై కీలక వివరాలు వెల్లడించారు.

Allu Sirish- Nayanika wedding celebrations have officially begun Allu Family performed haldi

2023లో టాలీవుడ్ హీరో నితిన్ ఆయన సతీమణి శాలిని దంపతులు ఏర్పాటు చేసిన ఓ పార్టీలో తొలిసారిగా నయనిక రెడ్డి- శిరీష్‌లు కలుసుకున్నారు. వీరి పరిచయం ప్రేమగా మారి కొన్నాళ్లు డేటింగ్ చేశారు. అనంతరం తమ ప్రేమను పెద్దలకు తెలియజేయగా వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. తన తాత, దిగ్గజ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా గతేడాది అక్టోబర్ 1న.. నయనికను పెళ్లాడనున్నట్లు అల్లు శిరీష్ అధికారికంగా ప్రకటించారు. ఈ వెంటనే వీరి నిశ్చితార్ధం ఘనంగా జరిగింది.

ఆ తర్వాతి నుంచి వీరి పెళ్లి ఎప్పుడు? ఇండియలోనా? ఫారిన్‌లోనా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. దీనికి చెక్ పెడుతూ మార్చి 6వ తేదీన అల్లు శిరీష్ - నయనికల వివాహం హైదరాబాద్‌లో జరుగుతుందని అల్లు ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ఆరోజు ఎంతో స్పెషాలిటీ కూడా ఉంది. అదే రోజున అల్లు శిరీష్ అన్నయ్య అల్లు అర్జున్ - స్నేహారెడ్డిల పెళ్లి రోజు. అదే రోజున తన పెళ్లి కూడా జరుగుతుండటంతో శిరీష్ సంబరపడిపోతున్నాడు.

పెళ్లి రోజు దగ్గర పడిపోతుండటంతో అల్లు ఫ్యామిలీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను ప్రారంభించింది. కొద్దిరోజుల క్రితం దుబాయ్‌లో అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. నగరంలోని ఓ లగ్జరీ షిప్‌లో వీరిద్దరూ తమ బంధువులు, సన్నిహితులతో పార్టీ చేసుకన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహారెడ్డి దంపతులతో పాటు అల్లు బాబీ తదితరులు ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. తాజాగా అల్లు శిరీష్ - నయనికల పెళ్లి వేడుకని అల్లు ఫ్యామిలీ ప్రారంభించింది.

ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ నివాసంలో పసుపు దంచే కార్యక్రమాన్ని అల్లు ఫ్యామిలీ గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ దంపతులు, శిరీష్, చిరంజీవి సతీమణి సురేఖ, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజినోవా, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని, చిరంజీవి కుమార్తె సుస్మితతో పాటు పలువురు బంధువులు, సన్నిహితులు సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను అల్లు శిరీష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

More from Filmibeat

Read more about: allu sirish Nayanika allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X