అల్లు శిరీష్ ఈ సారైనా హిట్టు కొట్టాడా? ‘ఎబిసిడి’ టాక్ ఎలా ఉంది?
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ 'ఎబిసిడి- అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
ఇందులో అల్లు శిరీష్ మిలియనీర్(నాగబాబు) కుమారుడిగా కనిపించాడు. డబ్బు విలువ తెలియకుండా కుమారుడు భారీగా ఖర్చు పెడుతుండటంతో ఆలోచనలో పడ్డ తండ్రి అతడికి డబ్బు విలువ తెలిసేలా చేయాలని ఇండియా పంపిస్తాడు. అప్పటి వరకు తండ్రి సంపాదించిన డబ్బుతో జల్సాలు చేసిన హీరో... ఇండియా వచ్చి చేతిలో డబ్బు లేకుండా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అతడిలో మార్పు రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటనే అంశాలు వివరిస్తూ ఈ చిత్రం తెరకెక్కింది.
సినిమాలో వినోదాత్మక అంశాలు లోపించాయాట
సినిమాలో వినోదాత్మక అంశాలు లోపించాయని, చాలా వరకు సినిమా బోరింగ్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్లు ఉన్నప్పటికీ అవి ప్రేక్షకులను అలరించలేదని, ఎమోషనల్ సీన్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేదని, ప్రతి అంశం అసహజంగా కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది.

క్రిటిక్స్ నుంచి యావరేజ్ రేటింగ్
ఆడియన్స్ నుంచి మాత్రమే కాదు.. క్రిటిక్స్ నుంచి కూడా ఈ చిత్రానికి యావరేజ్ రేటింగ్సే వస్తున్నాయి. నిర్మాణ విలువలు బాగోలేవని, కాస్టింగ్ కూడా సరిగా లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మలయాళంలో ఇది హిట్ మూవీ అయినప్పటికీ రీమేక్ పెర్ఫెక్టుగా చేయలేకపోయారని అంటున్నారు.
ఫర్వాలేదనే అభిప్రాయాలు కూడా...
మరికొందరు మాత్రం ఈచిత్రం ఫస్టాఫ్ ఫర్వాలేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కామెడీ చాలా బావుందని అంటున్నారు. ముఖ్యంగా అల్లు శిరీష్, భరత్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నట్లు చెబుతున్నారు. జస్ట్ టైమ్ పాస్ సింపుల్ ఎంటర్టెనర్ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈసారైనా హిట్టు కొడతాడా?
కొందరు ఫస్టాఫ్ కామెడీ నచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో మెగా అభిమానుల్లో సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది. కాస్త గుడ్ టాక్ వచ్చినా ఈ చిత్రం గట్టెక్కుతందని అంచనా వేస్తున్నారు. మరి శిరీష్ ఈసారైనా హిట్టు కొడతాడా? లేదా? అనేది శుక్రవారం సాయంత్రానికి ఓ క్లారిటీ రానుంది.

ఎబిసిడి
మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఏబీసీడీ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషించాడు. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ సంగీతం అందించారు. మధుర శ్రీధర్, యష్ రంగినేని నిర్మాతలు.


Click it and Unblock the Notifications











