అల్లు శిరీష్ ‘ఏబిసిడీ’ రిలీజ్ డేట్ ఫిక్సైంది
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న 'ఏబీసీడీ' మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ సంక్రాంతి సందర్భంగా స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. మార్చి 1వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విడుదలకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్స్ మొదలయ్యాయి.
సంజీవ్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. మెగా బ్రదర్ నాగబాబు ఇందులో అల్లు శిరీష్ కు తండ్రి పాత్రలో నటించారు. మాస్టర్ భరత్ హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించబోతున్నారు.

సురేష్ బాబు సమర్పణలో బిగ్ బెన్ సినిమాస్ యశ్ రంగినేనితో కలిసి మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ సంగీతం సమకూరుస్తున్నారు. రిలీజ్ ముందే ఈ మూవీ హిందీ శాటిలైట్ డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడవ్వడం విశేషం.
నిర్మాత సినిమా గురించి వెల్లడిస్తూ... మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఏబీసీడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాం. అక్కడ దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే ఈ చిత్రాన్ని మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications











