అన్నయ్య సినిమా వేడుకలకు అందుకే వెళ్ళను.. నేను అవసరం లేదు: అల్లు శిరీష్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక్క హిట్టు అంటూ కష్టపడి ప్రయత్నాలు చేస్తున్న యువ హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు. వైవిధ్యమైన సినిమాలు ఎన్ని చేసినా కూడా శిరీష్ కు కలిసి రావడం లేదు. అయినప్పటికీ తన ప్రయత్నాలను ఏ మాత్రం ఆపడం లేదు. అయితే ఇటీవల ఒక సినిమా ట్రైలర్ లాంచ్ కోసమని వెళ్లిన అల్లు శిరీష్ పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.

ఆ ఒక్క సినిమాతోనే..
అల్లు అరవింద్ చిన్న కుమారుడైన అల్లు శిరీష్ గౌరవం సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా వచ్చిన ఆ సినిమా పెద్దగా క్లిక్కవ్వలేదు. ఆ తరువాత ఈ హీరో ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద కలిసి రావడం లేదు. 2016లో పరశురామ్ దర్శకత్వంలో చేసిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ఒక్కటే కొంత ఆకట్టుకుంది.

కమర్షియల్ సినిమాలను కాకుండా
ఎలాగైనా హిట్స్ అందుకోవాలని శిరీష్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను కాకుండా కాస్త విభిన్నమైన స్టోరీలను ట్రై చేస్తున్నాడు. ఆ మధ్య ఒక్క క్షణం అనే సినిమాతో బాగానే హైప్ క్తియేట్ చేశాడు. కానీ ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది.

లవ్ లైఫ్ అండ్ పకోడీ ట్రైలర్ లాంచ్
చాలా వరకు ప్రైవసీ లైఫ్ కు ఎక్కువగా ఇష్టపడే శిరీష్ ఫ్యామిలీ ఈవెంట్స్ కు తప్పితే సినిమా వేడుకలకు కూడా చాలా దూరంగానే ఉంటాడు. ఇటీవల 'లవ్ లైఫ్ అండ్ పకోడీ' సినిమా ట్రైలర్ లాంచ్ లో శిరీష్.. సినిమా వేడుకలకు దూరంగా ఉండడానికి గల కారణాన్ని చెప్పాడు.

సినిమా ఈవెంట్స్ వెళ్లలేను
'లవ్ లైఫ్ అండ్ పకోడీ' అనే సినిమా ట్రైలర్ లాంచ్ అనంతరం అల్లు శిరీష్ మీడియాతో ఈ విధంగా మాట్లాడాడు. నేను సినిమా ఫంక్షన్ లకు ఎక్కువగా వెళ్ళను. గత పదేళ్లలో నా సినిమాలకు తప్పితే మరే సినిమా ఈవెంట్స్ కు నేను వెళ్లలేదు. ఆ మధ్య ఒక్క అల.. వైకుంఠపురములో సినిమాకు మాత్రమే వెళ్ళాను. అది కూడా మా నాన్న నిర్మించిన సినిమా కాబట్టి వెళ్ళాను.. అని అన్నాడు.

నేను లేకపోయినా..
రేసుగుర్రం, DJ, సరైనోడు, ఏ సినిమాలకు కూడా నేను వెళ్ళలేదు. ఎందుకంటే అవి పెద్ద సినిమాలు. నా అవసరం లేదు అక్కడ. నేను లేకపోయినా అందరికి తెలుస్తుంది. కానీ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కు రావడానికి కారణం.. పూర్తిగా కొత్త వాళ్ళతో నిర్మించిన చిన్న సినిమా కాబట్టి.. వాళ్లకు నా వంతుగా ఎంతో కొంత సపోర్ట్ చేయడానికి మాత్రమే వచ్చాను.. అని శిరీష్ వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











