అప్పుడు అలా ఇప్పుడు ఇలా.. మొత్తం మారిందంటోన్న అల్లు శిరీష్
అల్లు శిరీష్ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఫేమస్. సోషల్ మీడియాలో అల్లు శిరీష్ వేసే కౌంటర్స్, వేసే పంచ్‌లు ఓ రేంజ్‌లో పేలుతుంటాయి. అవసరమైన వారికి సాయం చేస్తూ.. ఎగతాళి చేసేవారికి కౌంటర్స్ వేస్తూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. ఈ లాక్ డౌన్ కాలంలో అల్లు శిరీష్ పడరాని కష్టాలు పడ్డాడు. ఒంటరిగా ఉంటూ తన కష్టాలన్నీ అభిమానులతో పంచుకున్నాడు. తన క్వారంటైన్ కష్టాలను వీడియో రూపంలో అందరితో చెప్పుకున్నాడు.
క్వారంటైన్‌లో ఉంటూ తినడం, పడుకోవడం, ఆడుకోవడం చేసి చేసి బోర్ కొట్టిందని వాపోయాడు. అయితే మధ్య మధ్యలో సోషల్ మీడియాలో నెటిజన్లు వేసే సెటైర్స్‌కు రివర్స్ కౌంటర్స్ వేసేవాడు. ఆ మధ్య నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ డిటెయిల్స్ అడిగితే టెంపర్ సినిమాల దయ డైలాగ్ చెప్పి నోరు మూయించాడు. అల్లు వారసులైన అర్హ, అయాన్‌లకు డ్యాన్సులో శిక్షణ కూడా ఇచ్చాడు. లాక్ డౌన్‌లో బాబాయ్‌లకు ఇదే పని అయిందంటూ డ్యాన్స్ నేర్పిస్తున్న వీడియోను షేర్ చేశాడు. తాజాగా బ్యాచ్‌లర్ లైఫ్ ఎలా మారింది, అప్పుడు ఎలా ఉందో చెప్పుకొచ్చాడు.

తాజాగా అల్లు శిరీష్ మేడిన్ ఇండియా మంత్రం జపిస్తున్నట్టు కనిపిస్తోంది. సౌత్ ఇండియన్ బ్యాచ్‌లర్ రూమ్‌లో ఇవే ఉంటాయని ఎంటీఆర్ సాంబర్ రైస్, ఎంటీఆర్ పొంగల్ వంటి వాటిని చూపించాడు. అంతేకాకుండా ఒకప్పుడు అన్ని ఇంపోర్టెడ్ బ్రాండెడ్ వస్తువులను వాడానని ఇప్పుడు మాత్రం పూర్తిగా లోకల్ వస్తువులను వాడుతున్నానని తెలిపాడు. దంత్ కాంతి, హిమాలయ ఫేస్ వాష్ వంటివాటిని చూపించాడు. గో లోకల్ వీ వోకల్ అనే స్లోగన్ కూడా ఇచ్చాడు.



Click it and Unblock the Notifications











