అల్లుడు అదుర్స్: క్లారిటీ వచ్చేసింది.. సెంటిమెంట్ ఫాలో అవుతున్న యంగ్ హీరో
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా సెంటిమెంట్లనే నమ్ముకుంటారనే సంగతి తెలిసిందే. హిట్ కాంబినేషన్స్ మొదలుకొని, సినిమా పేర్ల వరకూ సెంటిమెంట్ ఫాలో అవుతూ తమ తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెస్తుంటారు. సరిగ్గా ఇదే ఫార్ములా అప్లై చేస్తూ రంగంలోకి దిగుతున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.
రాక్షసుడు మూవీ తర్వాత తన తర్వాతి సినిమాను సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. గతేడాది నవంబర్ 29న ప్రారంభమైన ఈ చిత్రం డిసెంబర్ 6 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా టైటిల్ ఫిక్స్ చేస్తూ విడుదల తేదీ కూడా అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
ఈ సినిమాకు 'అల్లుడు అదుర్స్' అనే టైటిల్ ఫిక్స్ చేసిన దర్శకనిర్మాతలు.. చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంటే బెల్లంకొండ శ్రీనివాస్.. తొలి సినిమా అల్లుడు శీను టైటిల్ సెంటిమెంట్‌ని తన తాజా చిత్రానికి వాడినట్టు క్లియర్‌గా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సెంటిమెంట్ బెల్లంకొండపై ఎలాంటి హిట్ తెచ్చిపెడుతుందో!.

ఇకపోతే ఈ చిత్రంలో 8 ప్యాక్స్‌తో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆయన సరసన నభా నటేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











