పులి బోనులోకి పవన్ కల్యాణ్.. ఎవరూ చేయని ప్రయోగం చేస్తున్న డిప్యూటీ సీఎం

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ టాప్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. గతంలో కంటే వేగంగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటోన్న ఆయన ఇప్పటికే 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'బ్రో' వంటి చిత్రాలతో అలరించారు. ఇప్పుడు మరో మూడు, నాలుగు ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. అలా ఇప్పుడు పవర్ స్టార్ చేస్తోన్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డ విషయం తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి రూపొందిస్తోన్న చిత్రమే 'హరిహర వీరమల్లు'. మొగల్ సామ్రాజ్యం నాటి కథతో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా బ్రేకులు పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేస్తోంది. అందుకు తగ్గట్లుగానే వరుసగా షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. కానీ, పవన్ డేట్స్ వల్ల మళ్లీ షూట్ ఇప్పుడు ఆలస్యం అవుతోంది.

AM Rathnam Comments On Pawan Kalyan Tiger Fight In Harihara Veeramallu Movie

పిరియాడిక్ జోనర్‌లో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' మూవీ షూట్‌ను జూలై మొదటి వారం నుంచి ప్రారంభిస్తారని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది. అయితే, చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. 'హరిహర వీరమల్లు షూటింగ్‌కు పవన్ కల్యాణ్ గారి డేట్స్ ఎక్కువగా లేవు. కాబట్టి వీలు చూసుకుని ఆయనే వచ్చి సినిమాను పూర్తి చేస్తారు' అన్నారు.

ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో టైగర్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. ఇది గతంలో ఏ హీరో చేయని విధంగా ఉండబోతుంది. అందుకోసమే దాన్ని కెనెడాకు చెందిన ఓ కంపెనీకి అప్పగించాం. చూసే ప్రేక్షకులకు పిరియాడిక్ మూవీ చూస్తున్నామన్న ఫీల్ కలిగేలా వాళ్లు దాన్ని రెడీ చేస్తున్నారు. ఫస్టాఫ్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ దాదాపుగా కంప్లీట్ అయింది' అని చెప్పారు.

AM Rathnam Comments On Pawan Kalyan Tiger Fight In Harihara Veeramallu Movie

ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే తొలిసారి పిరియాడిక్ జోనర్‌లో రాబోతున్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X