హరిహర వీరమల్లు టీజర్ డేట్‌పై క్లారిటీ: ఆరోజే అని చెప్పిన నిర్మాత
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. అందుకు తగ్గట్లుగానే రీఎంట్రీలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటూ వెళ్తోన్నాడు. ఇక, ఇప్పటికే 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతో అలరించిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు మూడు, నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అలా ఇప్పుడు పవర్ స్టార్ చేస్తోన్న సినిమాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు.
మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా బ్రేకులు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేసుకుంటోంది. అందుకు అనుగుణంగానే షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ కూడా సరికొత్త ప్లాన్‌లతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది.

వాస్తవానికి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ కొత్త గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత దీన్ని రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26వ తేదీన రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. 'గణతంత్ర దినోత్సవం సందర్భంగా హరిహర వీరమల్లు టీజర్‌ను విడుదల చేస్తున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు పూర్తయ్యాయి' అని చెప్పారు.
ఇక, పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోన్న 'హరిహర వీరమల్లు' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది. ఇందులో నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. దీన్ని ఈ వేసవిలో విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











