Don't Miss!
- News
ఐప్యాక్ సర్వేతో రఘురామ రిజల్ట్స్ మ్యాచ్ ? పవన్-లోకేష్ ఎఫెక్ట్ కీలకం ! ముందస్తు ముహుర్తమిదే !
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
అమలా పాల్ మరో న్యూడ్ వీడియో.. ఇలా ఎప్పుడూ చూడలేదంటున్న నెటిజన్లు
దక్షిణాది హీరోయిన్ అమలా పాల్.. కొద్దిరోజులుగా ఈమె పేరు హాట్ టాపిక్ అయిపోయింది. భారతదేశంలో ఎక్కడ చూసిన ఈమె గురించే మాట్లాడుతున్నారు. దీనికి కారణం అమలా పాల్ నటించిన 'అడై' చిత్రమే. ఈ సినిమాతోనే మాత్రం బాగా ఫేమస్ అయిపోయింది. ఇందులో నగ్నంగా నటించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. గత నెలలో 'అడై' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి మంచి స్పందనే వచ్చింది. ఆ తర్వాత ఓ న్యూడ్ సీన్ విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా ఓ వీడియో సాంగ్ వదిలింది.

మిశ్రమ స్పందన
రెండు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఈ సినిమా బాగుందని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఈ సినిమాపై వ్యతిరేకంగా ఉన్నారు. ఈ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి చూసే అవకాశాలు లేవని అంటున్నారు. అయితే, తమ టార్గెట్ అయిన యువతకు సినిమా బాగా రీచ్ అయింది. దీంతో సినిమాకు కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి.

విమర్శకుల ప్రశంసలు
ఈ సినిమాను నగ్నత్వంతో కాకుండా మెచ్యూరిటీతో చూడాలని చాలా మంది పిలుపునిస్తున్నారు. ఇందులో అమలా పాల్ చేసిన ధైర్యాన్ని పలువురు సినీ విమర్శకులు కొనియాడుతున్నారు. ప్రస్తుతం చెడు దారి పడుతున్న యువతను మంచి మార్గంలో నడిపించేందుకు అవసరమైన మెసేజ్‌ను ఈ సినిమా ద్వారా ఇచ్చారని ప్రశంసిస్తున్నారు.

ఎందరికో ఆదర్శంగా నిలిచింది
ఈ సినిమాలో అమలా పాల్ చేసిన సాహసానికి మంచి మార్కులే పడ్డాయి. ఎందరో ఆమెలోని పట్టుదలను పొగుడుతున్నారు. అలాగే, చాలా మంది హీరోయిన్లు కూడా అమలను ఆదర్శంగా తీసుకుని పని చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. తెలుగు హీరోయిన్ బిందు మాధవి సైతం అమలలా నగ్నంగా నటించేందుకు రెడీ అని చెప్పిన విషయం తెలిసిందే.
వీడియో సాంగ్‌తో వచ్చింది
‘అడై' యూనిట్ ఈ సినిమా ఫలితంపై ఎంతో సంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ బృందం నుంచి మరో సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఈ సినిమాలోనే ముఖ్యమైన న్యూడ్ సీన్‌కు సంబంధించిన వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. శాడ్ సాంగ్‌గా ఉన్న ఈ పాటలో అమలా పాల్ నగ్నంగా కనిపించగా, ఆమె తల్లి మాత్రం పోలీస్ స్టేషన్‌లో బాధ పడుతూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత ఇంత మంచి నటిని ఎప్పుడూ చూడలేదని నెటిజన్లు కూడా పాజిటివ్‌గా కామెంట్లు పెడుతున్నారు.

అడై గురించి..
అమలా పాల్ నటించిన ‘అడై'/‘ఆమె'.. యువత మరీ ముఖ్యంగా అమ్మాయిలు దారి తప్పితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయి అనే కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రానికి రత్న కుమార్ దర్శకత్వం వహించగా.. వీ స్టూడియోస్ నిర్మించింది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రం జూలై 19 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.