మారువేషంలో అమలాపాల్.. నగ్నత్వంపై ప్రశ్నలు.. ఆశ్చర్యపోక తప్పలేదు

Recommended Video

Amala Paul's First Ever Live Prank In Theater || Filmibeat Telugu

ఓ స్టార్ హీరోయిన్ నగ్నంగా నటించడమంటే అది సంచలనమే. తాజాగా అదే చేసి చూపించింది అమలాపాల్. ఆమె తాజా చిత్రం 'ఆడై'లో పూర్తినగ్నంగా కనిపించి షాకిచ్చింది. అయితే అమలాపాల్ చేసిన ఈ క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో పలు విమర్శలు ఎదురైన సంగతి తెలిసిందే. మహిళా సంఘాలు సైతం వెండితెర మీద అమలాపాల్ నగ్నత్వంపై విమర్శలు గుప్పిస్తూ సినిమా నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. కానీ ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఎట్టకేలకు ఈ సినిమా విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

తెలుగులో 'ఆమె'.. తమిళంలో 'ఆడై'

తెలుగులో 'ఆమె'.. తమిళంలో 'ఆడై'

సినిమా విడుదలకు ముందే ట్రైలర్ ద్వారా సంచలనం సృష్టించిన అమలాపాల్.. విడుదలయ్యాక విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగు, తమిళ రెండు భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ సినిమా తెలుగులో 'ఆమె' టైటిల్‌తో, తమిళంలో 'ఆడై' టైటిల్‌తో జులై 19 వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది.

మిశ్రమ స్పందన తెచ్చుకుంటూనే

మిశ్రమ స్పందన తెచ్చుకుంటూనే

మరోవైపు ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఈ సినిమా బాగుందని చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఈ సినిమాపై వ్యతిరేకంగా ఉన్నారు. సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి చూసే అవకాశాలు లేవని అంటున్నారు. కాకపోతే, తమ టార్గెట్ అయిన యువతకు సినిమా బాగా రీచ్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

మారువేషంలో అమలాపాల్

మారువేషంలో అమలాపాల్

అయితే సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది? తన క్యారెక్టర్, నగ్నత్వంపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉందనే విషయం తెలుసుకోవడాని స్వయంగా మైక్ పట్టుకొని థియేటర్‌కి వెళ్ళింది అమలాపాల్. తాను అమలాపాల్ అని తెలిసేలా కాకుండా మారు వేషం ధరించి జర్నలిస్టుగా తమిళనాడు లోని ఓ థియేటర్‌కి వెళ్లి ప్రేక్షకుల రెస్సాన్స్ పసిగట్టింది అమలాపాల్.

నగ్నత్వంపై ప్రశ్నలు

నగ్నత్వంపై ప్రశ్నలు

వైట్ టీ షర్ట్‌, క‌ళ్ల‌ద్దాలు, టోపీ పెట్టుకుని థియేటర్‌కి వ‌చ్చిన అమ‌ల‌పాల్‌ని ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌లేక‌పోయారు. పైగా సినిమాలో అమలాపాల్ నటన, నగ్నత్వంపై అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు కూడా చెప్పారు. తన నటనపై పాజిటివ్ స్పందన చూసి.. క్యాప్‌, క‌ళ్ల‌ద్దాలు తీసేసి అక్క‌డున్న వారంద‌రికీ షాకిచ్చింది. ఆమెను అప్పటిదాకా జర్నలిస్టు అనుకున్న వారు.. త‌మ‌తో ఉన్న‌ది అమ‌ల‌పాల్ అని తెలియ‌గానే ఆశ్చర్యపోయి సెల్ఫీలు దిగారు.

అడై గురించి..

అడై గురించి..

అమలా పాల్ నటించిన ‘అడై'/‘ఆమె'.. యువత మరీ ముఖ్యంగా అమ్మాయిలు దారి తప్పితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయి అనే కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రానికి రత్న కుమార్ దర్శకత్వం వహించగా.. వీ స్టూడియోస్ నిర్మించింది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X