అఖిల్ న్యూ మూవీలో ‘సిసింద్రి’ కాంబినేషన్... తల్లిగా ఆవిడే!
అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఇటీవల న్యూ మూవీ ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీవాసు, వాసు వర్మ నిర్మించబోతున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కాస్టింగ్ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం అఖిల్ తల్లి పాత్రకు ప్రముఖ నటి ఆమని ఎంపికైనట్లు తెలుస్తోంది. అఖిల్ చిన్నతనంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'సిసింద్రి'లో కూడా ఆమని-అఖిల్ తల్లికొడుకులుగా నటించిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి హీరోయిన్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణం ఎంపిక జరుగాల్సి ఉంది. ప్రస్తుతం దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఇదే పనిలో బిజీగా ఉన్నారు. త్వరలోనే అన్ని వివరాలతో చిత్ర బృందం నుంచి అఫీషియల్ ప్రకటన రానుంది.
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్‌ను గత సినిమాలకు భిన్నంగా ఒక క్యూట్ లవ్ స్టోరీతో ఈ చిత్రంలో ప్రజెంట్ చేయబోతున్నాడట. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. వి మణికందన్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.
2015లో 'అఖిల్' మూవీ ద్వారా తెరంగ్రేటం చేసిన ఈ అక్కినేని వారసుడికి ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు. 2017లో వచ్చిన 'హలో' కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా అఖిల్‌ను స్టార్‌గా నిలబెట్టడంలో విఫలమైంది. ఈ ఏడాది మొదట్లో వచ్చిన 'మిస్టర్ మజ్ను' సైతం బాక్సాఫీసు వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











