ఆసక్తికరంగా అమర్ అక్బర్ ఆంటోని కాన్సెప్ట్ పోస్టర్!
రవితేజ నటిస్తున్న తాజా చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. తన బాగా అచ్చొచ్చిన శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ చాలా కాలం తరువాత నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నడుము సుందరి ఇలియానా మరలా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ చిత్ర కాన్సెప్ట్ తెలియజేసేలా టైటిల్ పోస్టర్ విడుదుల చేశారు.
టైటిల్ డిజైన్ చూస్తుంటే మానవత్వానికి సంబంధించిన అంశలతో, మనం ఏం చేస్తే అది రిటర్న్ గిఫ్ట్ రూపంలో మనకే దక్కుతుంది అనే కాన్సెప్ట్ గోచరించేలా టైటిల్ డిజైన్ చేశారు. కానీ కాన్సెప్ట్ కి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇవ్వకుండా ఉత్కంఠ పెంచే ప్రయత్నం చేశారు. మొత్తంగా టైటిల్ డిజైన్ బావుంది.

మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న శ్రీనువైట్ల, రవితేజకు ఈ చితం విజయం సాధించడం చాలా కీలకం. బాద్షా తరువాత శ్రీనువైట్ల నుంచి ఒక్క హిట్ చిత్రం కూడా రాలేదు.


Click it and Unblock the Notifications











