సాయి పల్లవితో పనైపోయింది.. 300 కోట్ల సినిమాపై ఫ్యాన్స్, కాంట్రవర్సియల్ సింగర్ ఆగ్రహం

దేశంలోని దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో కూడా చాలా వరకు సినిమాలు అన్నీ హీరోల మీదనే సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఆయా హీరోల స్టార్ ఇమేజ్ ఆధారంగానే ఆ సినిమాలు పెర్ఫామెన్స్ ఉంటుంది అని అందరికీ తెలిసిందే. కానీ ఇది కొంతమంది హీరోయిన్స్ దగ్గర చెల్లదు అని చెప్పొచ్చు. హీరోల కోసం ప్రేక్షకులు ఎలాగైతే థియేటర్స్ కి వస్తారో హీరోయిన్స్ కోసం కూడా థియేటర్స్ కి వచ్చేవారు కూడా ఉన్నారు.

అయితే మేల్ డామినేషన్ నడుస్తున్న ఇండస్ట్రీస్ లో పలువురు హీరోయిన్స్ ధీటుగా నిలిచి తమ కోసం కూడా ఆడియెన్స్ ని రప్పించుకుంటారు. ఇలాంటి హీరోయిన్స్ లో ప్రెజెంట్ ట్రెండ్ లో అయితే సాయి పల్లవి తప్పక కనిపిస్తుంది. సాయి పల్లవి చేసిన ఇన్ని సినిమాల్లో కూడా చాలా చిత్రాల్లో వద్దన్నా తన డామినేషన్ కనిపిస్తుంది. అలా సాయి పల్లవి బ్రాండ్ మీద పలు హిట్స్ ఉన్నాయి ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి.

amaran makers ignoring sai pallavi after success controversial singer fires

కానీ రీసెంట్ గా ఆమె నటించిన చిత్రం "అమరన్" తో మళ్ళీ తన హవా సాయిని పల్లవి చూపించింది అని ట్రేడ్ వర్గాలు కోడై కూశాయి. అమరన్ సినిమాకి మేజర్ హైలైట్స్ లో సాయి పల్లవి కూడా ఒకరని, వసూళ్ల ప్రభావం కూడా తన మూలానే అంటూ చాలా కామెంట్స్ సినీ ట్రాకర్స్ నుంచి వినిపించాయి.

అయితే తమిళ సినిమా దగ్గర ఏమో కానీ తెలుగు మార్కెట్ లో మాత్రం భారీ వసూళ్లు సాధ్యమైందంటే సినిమా కంటెంట్ తో పాటుగా సాయి పల్లవి ప్రెజెన్స్ కూడా బాగా ప్లస్ అయ్యింది అంటూ ఎన్నో మాటలు వినిపిస్తున్నాయి. మరి వీటిని మేకర్స్ నిజంగానే సీరియస్ గా తీసుకున్నారో ఏమో కానీ రీసెంట్ గా వచ్చిన పలు పలు పోస్టర్స్ లో ఒక్క దానిలో కూడా సాయి పల్లవి ఫోటోని హీరో శివ కార్తికేయన్ తో కలిపి విడుదల చేసింది లేదు.

దీనితో సోషల్ మీడియాలో సాయి పల్లవి ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఈ క్రమంలో ప్రముఖ సింగర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సహా కాంట్రవర్సియల్ ఫెమినిస్ట్ అయినటువంటి చిన్మయి శ్రీపాద కూడా ఫైర్ అవ్వడం జరిగింది. ఓ హీరో సినిమా పెద్ద సక్సెస్ కొడితే నెమ్మదిగా ఆ సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ ని ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు అంటూ చిన్మయి.. అమరన్ అలాగే ధనుష్ రౌడీ బేబీ సాంగ్ పోస్టర్స్ తో పోస్ట్ చేశారు.

అమరన్ 300 కోట్ల వసూళ్లు అందుకుంది . అయినా కూడా ఒక్క పోస్టర్ లోనూ సాయి పల్లవి ఫోటో వేయలేదు అని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. సినిమా రిలీజ్ ముందు వరకు సాయి పల్లవి ఉన్న పోస్టర్స్ కూడా రిలీజ్ చేసి, విడుదల అయ్యి హిట్ అయ్యాక మాత్రం ఒక్క హీరో ఉన్న పోస్టర్స్ నే వేసుకుంటున్నారు అంటూ సాయి పల్లవి ఫ్యాన్స్ చిత్ర నిర్మాణ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇది వైరల్ గా మారడంతో సినిమాపై ఫైనల్ గా 25వ రోజు పోస్టర్ ని మాత్రం మెయిన్ లీడ్ పై విడుదల చేశారు. దీనితో సాయి పల్లవితో పనైపోయింది కాబట్టి అప్పుడు తీశారు .ఇపుడు నెగిటివ్ రావడంతో మళ్ళీ పెట్టారు. సో ఇకనైనా ఆమె అభిమానులు కూల్ అవ్వాలని నెటిజన్స్ హితవు పలుకుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X