ఆ ఓటీటీ చేతికి సర్కారు వారి పాట రైట్స్: ఎప్పుడు స్ట్రీమింగ్ చేయబోతున్నారంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోని బడా హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. అద్భుతమైన యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్‌తో పాటు హ్యాండ్సమ్ లుక్స్‌తో మాయ చేస్తోన్న అతడు.. సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉన్నాడు. ఫలితంగా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇలా ఈ మధ్య కాలంలో 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లను అందుకుని హ్యాట్రిక్‌ను కూడా సాధించాడు.

కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం తెరకెక్కిస్తోన్న 'సర్కారు వారి పాట'లో నటిస్తున్నాడు. బ్యాంకులను మోసం చేసే బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని సెటైరికల్‌గా రూపొందిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత జనవరిలోనే మొదలైంది. అప్పటి నుంచి చిత్ర యూనిట్ పలు షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇలా ఇప్పటికే దాదాపు డెబ్బై శాతం షూట్‌ను పూర్తి చేసేశారు. ఇంకొంత భాగం అయితే సినిమా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మహేశ్ బాబు సర్జరీతో దీనికి మరోసారి ఆటంకం ఏర్పడింది.

ఇటీవలే మహేశ్ బాబు మోకాలికి సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకున్నాడు. ఆ వెంటనే కరోనా బారిన పడ్డాడు. దీంతో మరిన్ని రోజులు అతడు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లోనూ చిత్ర యూనిట్ షూట్‌ను క్రమంగా పూర్తి చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ను మొదలు పెట్టారు. ఇందులో మహేశ్ బాబు లేని సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు. ఇక, ఇందులో అతడు ఫిబ్రవరి రెండో వారం నుంచి పాల్గొనబోతున్నాడు. మార్చి కల్లా టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ టార్గెట్ పెట్టుకుంది. దీంతో ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను సైతం అనౌన్స్ చేసేశారు.

Amazon Prime Bagged Sarkaru Vaari Paata Digital Rights

'సర్కారు వారి పాట' మే 12న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్‌పై చిత్ర యూనిట్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ సంస్థకు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ హక్కుల కోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఇది విడుదలైన ముప్పై రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని డీల్ కూడా చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇది మేలో విడుదల అయితే.. జూన్ మధ్యలో డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకూ విడుదలైన అన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక, ఈ సినిమా నుంచి ఫిబ్రవరి 14న ఫస్ట్ సాంగ్ రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X