‘Khiladi’ హక్కులు ఆ ఓటీటీ సంస్థకే: రవితేజ కెరీర్‌లోనే తొలిసారి ఇంత భారీ డీల్
కొంత కాలంగా హిట్ అందుకోలేక పడిన ఇబ్బందులను ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'క్రాక్' మూవీతో తీర్చుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఎన్నో అంచనాలు, ఆశల నడుమ విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇది వచ్చిన చాలా తక్కువ రోజుల్లోనే మరో సినిమాను ప్రకటించాడు. అదే రమేష్ వర్మ తెరకెక్కిస్తోన్న 'ఖిలాడీ'. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
మాస్ మహారాజ రవితేజ తాజా చిత్రం 'ఖిలాడీ' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థలన్నీ తెగ పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది రవితేజ కెరీర్‌లోనే భారీ డీల్ అని తెలుస్తోంది. దీని ద్వారా ఈ సినిమాను డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారన్న వార్తలకు బ్రేక్ పడినట్లు అయింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఖిలాడీ' మూవీలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అలాగే, పోస్టర్లు కూడా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ మూవీని సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











