Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ ఓటీటీకి ‘కొండపొలం’ మూవీ డిజిటల్ హక్కులు: ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఆ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వడమే. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి ఎంతో మంది కుర్రాళ్లు టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఈ క్రమంలోనే గత ఏడాది మరో వారసుడు కూడా తెరంగేట్రం చేశాడు. అతడే మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన 'ఉప్పెన' అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడతను. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు, యాభై కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. దీంతో అతడికి గ్రాండ్ ఎంట్రీ దక్కినట్లైంది.
Bigg Boss: లహరిపై పింకీ సంచలన వ్యాఖ్యలు.. షోలో అతడితో అలాంటి పనులు.. ఇద్దరి బండారం బట్టబయలు
'ఉప్పెన' మూవీ విడుదల కాకముందే మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తన రెండో చిత్రం 'కొండపొలం'ను ప్రారంభించాడు. ఆ వెంటనే అంటే చాలా తక్కువ రోజుల్లోనే షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్నాడు కూడా. అయితే, ఇది పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోడానికి చాలా సమయం తీసుకుంది. టాలీవుడ్‌లో టాలెంటెడ్ డైరెక్టర్‌లలో ఒకడైన క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం కొద్ది రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు.

'కొండపొలం' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీనికి అనుగుణంగానే రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ప్రతికూల పరిస్థితులతో పాటు టికెట్ రేట్ల ఇష్యూ ఉండడంతో కలెక్షన్లు మాత్రం స్థాయిలో రాలేదు. ఆ వెంటనే దసరా సీజన్‌లో మరిన్ని చిత్రాలు రావడంతో థియేటర్ల కొరత కూడా ఏర్పడింది. ఫలితంగా ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోలేదు. దీంతో నిర్మాతలకు నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్‌పై తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కొండపొలం' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే ఖర్చు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమా నవంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ కానుందని ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. మరోవైపు, ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై మెగా అభిమానులు క్లారిటీ కోరుకుంటున్నారు.
క్రేజీ కాంబినేషన్‌లో సందేశాత్మకంగా రూపొందిన ఈ సినిమాను 'కొండపొలం' అనే నవల ఆధారంగా రూపొందించారన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే దీనికి అదే టైటిల్ పెట్టారు. ఫుల్ ఎమోషన్స్‌తో సాగే ఈ మూవీ పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కింది. దీన్ని రాజీవ్ రెడ్డి - జాగర్లమూడి సాయిబాబా కలిసి నిర్మించిన విషయం తెలిసిందే. ఎమ్ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.