Pushpa OTT Release: పుష్ప ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్.. షాకింగ్ ట్విస్ట్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత ఏడాది అత్యధిక స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా పుష్ప సినిమా మొట్ట మొదటి స్థానంలో నిలిచింది. 2020 అల..వైకుంఠపురములో సినిమా తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బన్నీ ఆ తర్వాత ఏడాది కూడా అదే తరహాలో సక్సెస్ కొనసాగించడం విశేషం. ఇక పుష్ప సినిమా ఓటీటీ విడుదలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న న్యూస్ పై అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది.

మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్..
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ తో ఎప్పటినుంచో ఒక మాస్ కమర్షియల్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక మొత్తానికి పుష్ప సినిమాతో వీరి కాంబినేషన్ పాన్ ఇండియా రేంజ్ లో సెట్ అయింది. అయితే మొదట పుష్ప సినిమాకు అనుకున్నంత స్థాయిలో అయితే పాజిటివ్ టాక్ క్రియేట్ అవ్వలేదు. కేవలం అల్లు అర్జున్ నటన మాత్రమే బాగుంది అని ఓ వర్గం ప్రేక్షకులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.

300కోట్ల గ్రాస్ కలెక్షన్స్..
ఏదేమైనా కూడా అల్లు అర్జున్ పుష్ప సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే అందుకుంది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు నిర్మాతలు ప్రచారాలు కూడా చేస్తున్నారు. అంతే కాకుండా సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా మునిగి తేలుతున్నారు

టాప్ సౌత్ మూవీలలో..
ముఖ్యంగా హిందీ మార్కెట్లో పుష్ప సినిమా ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ అందుకోవడం విశేషం. పదిహేను రోజుల తర్వాత కూడా స్టాండర్డ్ గా ఉండడం ఆశ్చర్యకరం. హిందీలో పుష్ప మొదటి భాగం 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకొని ఒక సరికొత్త రికార్డును నెలకొల్పింది. నార్త్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన టాప్ సౌత్ సినిమాలలో 4వ స్థానంలో పుష్ప కొనసాగుతోంది.

మిగతా భాషల్లో కూడా..
ఒక విధంగా పుష్ప సినిమాకు మిగతా సినిమాల నుంచి పోటీ కూడా లేకపోవడం బాగా కలిసి వచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద సినిమాలు ఏవి అంతగా ఆసక్తి గా లేకపోవడం తో మాస్ ప్రేక్షకులు పూర్తిగా పుష్ప వైపు యూ టర్న్ తీసుకున్నారు. ఇక ఈ సినిమా కేవలం హిందీ లోనే కాకుండా తమిళ్ మలయాళంలో కూడా బాగానే వసూళ్లను అందుకొని తెలుగులో కూడా దాదాపు చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను ఫినిష్ చేసింది.

జనవరి 7న ఓటీటీలో అంటూ..
అయితే పుష్ప సినిమాను ఓటీటీలో ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి జనవరి 7వ తేదీ నుంచి సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్నట్లు కొందరు జర్నలిస్టులు కూడా వివరణ ఇవ్వడంతో అందరూ అది నిజమే అని అనుకున్నారు.
Recommended Video

ఎలాంటి నిజం లేదు..
ఇక పుష్ప మొదటి భాగం ఓటీటీ రిలీజ్ పై ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ క్లారిటీ ఇచ్చేసింది. ఇంకా ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని అఫీషియల్ గా ట్విట్టర్ ద్వారా అమెజాన్ ప్రైమ్ తెలియజేసింది. వైరల్ అవుతున్న న్యూస్ ఎలాంటి నిజం లేదు అని త్వరలోనే ఆ విషయంలో తాము క్లారిటీ ఇస్తామని కూడా అమెజాన్ ప్రైమ్ వివరణ ఇవ్వడంతో అభిమానులకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేసింది.


Click it and Unblock the Notifications











