Ambajipeta Marriage Band First Review మైండ్ బ్లోయింగ్.. ఫస్టాఫ్ పగిలిపోయింది.. విజయ్ దేవరకొండ రివ్యూ
కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో నటుడిగా మించి మార్కులు సంపాదించుకొన్న సుహస్ నటించిన చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండ్. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శివానీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బిగ్ టికెట్‌ను ఆవిష్కరించి సినిమా యూనిట్ సభ్యులతో మాట్లాడారు. ఈ మూవీ గురించి ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..
అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాను నేను ఇప్పటికే చూశాను. ఫస్టాఫ్ పగిలిపోయింది. సాధారణంగా సినిమా చూసేటప్పుడు కొంత సేపు ఆపేసి ఏదైనా తిందామని అనిపిస్తుంటుంది. కానీ ఈ సినిమా చూసినప్పుడు ఎలాంటి స్టాప్స్ లేకుండా సినిమా చూశాను. అందరూ ఏం చేశారురా అనే ఫీలింగ్ కలిగింది అని విజయ్ దేవరకొండ చెప్పారు

అంబాజీపేట సినిమాలో టెక్నికల్‌గా బాగుంది. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆర్ట్ విభాగం సెటప్ బాగుంది. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ కూడా అద్బుతంగా అనిపించించాయి అని మూవీ గురించి విజయ్ దేవరకొండ తెలిపారు.
నేను మూవీ ఇప్పటికే చూశాను. ఫార్మల్‌గా ట్రైలర్ చూశాను. బిగ్ టికెట్ లాంఛ్ చేశాను. ఈ సినిమా టీమ్ అంతా తెలుసు. నిర్మాత ధీరజ్ నాకు తెలుసు. డైరెక్టర్ దుశ్యంత్ డియర్ కామ్రేడ్ సినిమాకు అసిస్టెంట్‌గా వర్క్ చేశారు. సుహస్ నాతో నటించాడు. ఈ సినిమా టీజర్ నాకు చూపించినప్పుడు దుశ్యంత్ ఈ సినిమా తీశాడా అనే ఆశ్చర్యం కలిగింది. టీజర్ చూసే మైండ్ బ్లోయింగ్ అయింది అని విజయ్ దేవరకొండ చెప్పారు.

ఖుషి సినిమాలో నాతో శరణ్య ప్రదీప్ నటించింది. ఆమె చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఆమె టాలెంట్ అందరికి తెలుసు. శివానీకి తొలి సినిమా. ఆమె బాగా ఫెర్ఫార్మ్ చేసింది. సుహాస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని తెలిపారు.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాకు నా వంతు సహకారం అందించాలని అనుకొన్నాను. ఈ సినిమా బ్యూటిఫుల్ మూవీ. మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. చాలా స్ట్రాంగ్ కంటెంట్. ఫిబ్రవరి 2 తేదీన రిలీజ్ అవుతున్నది. తప్పకుండా ఈ సినిమాను చూడండి అని విజయ్ దేవరకొండ చెప్పారు.


Click it and Unblock the Notifications











