Ambajipeta Marriage Band Twitter Review కంటెంట్‌తో అదరగొట్టిన డైరెక్టర్.. సుహస్, శరణ్య, శివానీ ఫెర్ఫార్మెన్స
యువ నటుడు సుహస్ నటించిన చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండ్. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శివానీ హీరోయిన్‌గా నటించింది. ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్ల రివ్యూ విషయానికి వస్తే..

అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ చిత్రం కంటెంట్ ప్రధానంగా సాగే సినిమా. కమర్షియల్ అంశాలకు పోకుడా నిజాయితీగా చెప్పిన ఎమోషనల్ డ్రామా. ఆంధ్రా గ్రామీణ ప్రాంతాల్లో సాగే మలయాళ చిత్రంగా అనిపిస్తుంది. డీసెంట్ వాచ్ అని అన్నారు.
ఫస్టాఫ్ టెర్రిఫిక్‌గా ఉంది. హై ఇంటెన్స్, ఎమోషనల్ డ్రామా. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా బ్లాక్ బస్టర్ వైపు దూసుకెళ్తున్నది. అని బీఏ రాజు టీమ్ ట్వీట్ చేసింది.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా బాగుంది. సుహాస్‌కు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్. సుహాస్, శరణ్య అద్బుతంగా నటించారు. ప్రతీ టెక్నిషియన్ వర్క్ బాగుంది. ఎమోషనల్‌గా సాగే కంటెంట్ ప్రధాన చిత్రం అని నెటిజన్ కామెంట్ చేశాడు.
అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ ఫస్టాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సీట్లకు హత్తుకుపోయేలా ఉంటుంది. సుహస్ యాక్టర్ బ్రిల్లియెంట్‌గా ఉంది. ప్రతీ సీన్‌లో అద్బుతంగా నటించాడు. అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. కథ రెగ్యులర్‌గానే ఉంది. కాకపోతే స్క్రిన్ ప్లే ఫ్రెష్‌గా ఉంది. రస్టిక్ యాక్షన్ సీన్లు బాగున్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











