సోఫాతో సెటిల్మెంట్ .. టాలీవుడ్ పెద్దలపై అంబటి సెటైర్?
గత కొన్ని రోజులు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 ది రూల్ బాక్సాఫీస్‌ను ఎలా రూల్ చేస్తుందో అందరికీ తెలిసిందే. టోటల్ ఇండియా వైడ్ గా కూడా పుష్ప రాజ్ రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తున్నాడు. అయితే బాక్సాఫీస్ పరంగా ఈ చిత్రం ఓ రేంజ్ లో రాణిస్తున్నప్పటికీ దీనితో పాటుగా ఊహించని కాంట్రవర్సీలో కూడా ఈ సినిమా చిక్కుకుంది.
ఈ నేపథ్యంలో పుష్ప 2లో పలు సన్నివేశాలు అలాగే పాటలు కూడా కొన్ని అభ్యంతరాలు తీసుకొచ్చాయి. ఇవి చాలవు అన్నట్టుగా అల్లు అర్జున్ ఊహించని కాంట్రవర్సీలలో ఇరుక్కోవడం ఇలా పెద్ద హై డ్రామానే నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణాలో ఓ రేంజ్ లో అల్లు అర్జున్ ఇష్యూ నడుస్తుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణాలో జరిగిన ఇష్యూస్ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఇకపై టికెట్ ధరలు పెంచేది లేదని అలాగే సినిమా బెనిఫిట్ షోస్ కూడా రద్దు చేస్తున్నామని సంచలన ప్రకటన చేశారు. దీంతో ఉలిక్కిపడిన టాలీవుడ్ పెద్దలు.. ఆగమేఘాల మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా అక్కడి మంత్రులను కలవడం ట్రెండింగ్ టాపిక్ గా మారింది.
కాగా ఇదే తరహాలో గతంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో జరిగిన సినీ పెద్దల మీటింగ్ కూడా చాలా మందికి గుర్తొచ్చింది. కాగా ఈ సమయంలో తెలంగాణలో జరిగిన మీటింగ్ పై అన్నట్టు ఇన్ డైరెక్ట్ గా ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ మధ్య తాను అల్లు అర్జున్‌కి ఆయన నటించిన పుష్ప 2కి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు.
అయితే నిన్న ఓ పక్క టాలీవుడ్ పెద్దల మీటింగ్, ఇంకో పక్క పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ వెళ్లి రాజకీయ నాయకులని సోఫాలో భారీ మొత్తంలో డబ్బులు పంపించి సెటిల్ చేసుకునే సీన్స్ ఉంటాయి. కాగా ఇపుడు ఇలాంటి పోస్ట్‌ని తాను చేయడంతో ఇన్ డైరెక్ట్ గా ఆ మీటింగ్ పై సెటైర్ వేసినట్టుగా అనిపిస్తుంది. మరి నిజంగానే అలా జరిగి ఉంటే టాలీవుడ్ కి సానుకూలంగా నిర్ణయాలు వచ్చేవి కానీ అలా ఏమి జరగలేదు.
సో డెఫినెట్ గా తాను పరోక్షంగా ఈ మీట్ పై ఆ పోస్ట్ చేసి ఉంటే అది వేస్ట్ అయినట్టే అనుకోవాలి. కానీ ఇంకా పూర్తి పరిష్కారానికి సోఫా చేరాలి అంటూ టాలీవుడ్ పెద్దలకు కూడా ఏమన్నా ఇస్తే కానీ మీ సమస్య సాల్వ్ అవ్వదు అన్నట్టు ఈ ట్వీట్ ఉందంటూ సినీ జనాలు చర్చించుకుంటున్నారు. ఇలా మొత్తానికి అయితే అంబటి రాంబాబు చేసిన పోస్ట్ ఇపుడు సినీ , రాజకీయ వర్గాల్లో కూడా స్పెషల్ అటెన్షన్ తెచ్చుకుంది. ప్రస్తుతానికి అయితే తెలంగాణాలో మాత్రం టాలీవుడ్ కి గట్టి దెబ్బే తగిలింది అని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications











