సుకుమార్ పై అంబటి రాయుడు షాకింగ్ కామెంట్స్.. ఇలా అనేసాడేంటి
మన దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకి ఉన్న బలమైన ఎమోషనల్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది మన దేశం పట్ల ఉన్న అమితమైన ప్రేమ, గౌరవం అని చెప్పవచ్చు. కాగా ఇదే దేశ భక్తి మన నుంచి స్పోర్ట్స్ పరంగా కూడా చాలా బలంగా కనిపిస్తుంది. అయితే మన జాతీయ క్రీడ కాకపోయినప్పటికీ ఇండియా క్రికెట్ అంటే ఎన్నో దశాబ్దాల పాటుగా ప్రాణం పెట్టే అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు.
కాగా ఇలా క్రికెట్ అనే బలమైన ఎమోషన్ భారతీయుల నర నరాల్లో ఇంకిపోయింది. ఇక ఇదే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఆ నరాలు తెగే ఉత్కంఠ రేగాల్సిందే. ఇదే మనకి బిగ్గెస్ట్ రైవల్ కూడా.. అయితే చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లేటెస్ట్ గా జరగగా మళ్ళీ అదే రసవత్తర పరిస్థితులు కూడా కనిపించాయి. కాగా ఈ మ్యాచ్ లో భారత జట్టు అఖండ విజయం సాధించిన సంగతి కూడా తెలిసిందే.

మరి ఈ మ్యాచ్ వీక్షించేందుకు మన తెలుగు సినిమా నుంచి కూడా చాలా మంది సినీ తారలు కూడా వెళ్లారు. కాగా వీరిలో మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగాస్టార్ చిరంజీవి లాంటి టాప్ స్టార్స్ కూడా వెళ్లారు. అయితే ఇలా క్రికెట్ కి వెళ్లడం మన వాళ్ళకి సహజమే.. కానీ ఇపుడు ఈ మ్యాచ్ విషయంలో ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన షాకింగ్ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.
కాగా అంబటి రాయుడు భారత జట్టుకి సహా చెన్నయ్ సూపర్ కింగ్స్ అనే జట్టులో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ కోసం తెలుగు కామెంట్రీ కోసం అంబటి రాయుడు కూడా వెళ్లడం జరిగింది. అయితే ఇందులో ఓ సందర్భంలో ఇతర కామెంటేటర్లు మ్యాచ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు సుకుమార్ కనిపించిన విజువల్స్ కెమెరా మ్యాన్ చూపించగా..

మన వాళ్ళు సుకుమార్ కి ఎలివేషన్స్ ఇస్తూ చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అని కామెంట్స్ చేస్తున్న సమయంలో అంబటి రాయుడు మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశారు. అలా ఏం కాదు ఇలాంటి మ్యాచ్ లు అయితే టీవిలో ఎక్కువ కనిపించవచ్చు అని వస్తుంటారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఇది అక్కడ సుకుమార్ ని చూపించడం వల్ల అతన్నే అన్నట్టుగా ప్రొజెక్ట్ అయ్యింది.
కానీ మన తెలుగు సినీ ప్రముఖులు మొత్తం కోసం తాను అన్నట్టుగా ఇంకొందరు అంటున్నారు. అయితే వారి కోసం అయినా కూడా ఫేమ్ కోసం టీవీల్లో కనిపించడం కోసం సినీ ప్రముఖులు మ్యాచ్ చూసేందుకు వస్తారా అనేది మాత్రం అంబటి రాయుడు మాటల్లో సీరియస్ గానే తీసుకోవాల్సిన అంశం అని చెప్పవచ్చు. ఇలా ప్రస్తుతం అంబటి రాయుడు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











