లైవ్ షోలో జారిపోయిన స్టార్ హీరోయిన్ డ్రెస్ .. చేతులతో కవర్ చేసుకుంటూ
Photo Courtesy: Jennifer Lopez/Youtube
కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించిన వారు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అదుపు తప్పినా ఎన్నో విమర్శలతో పాటు అవమానాలు పడాల్సి వస్తుంది. హావభావాలు, మాటలు, చేతలు చివరికి ధరించే దుస్తుల విషయంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ లైవ్ షోలో డ్యాన్స్ చేస్తుండగా ఆమె ధరించిన దుస్తులు జారిపోయాయి. పరువు కాపాడుకునేందుకు సదరు బ్యూటీ ఆపసోపాలు పడింది. ఈ వివరాల్లోకి వెళితే..
పాప్ రారాణిగా నీరాజనాలు
పాప్ సింగర్, హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెన్నిఫర్ లోపెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాప్ ప్రపంచంలో రారాణిగా వెలుగొందుతూ, నటిగానూ తను మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నారు. సినిమాలు, పాటలు కంటే ప్రేమాయణాలు, ఎఫైర్లు, విడాకుల వార్తలతో ఆమె వార్తల్లో నిలిచారు. 56 ఏళ్ల వయసులోనూ హాట్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులకు సెగలు రేపుతుంటారు. ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో జెన్నీ కూడా ఒకరు. డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన జెన్నీఫర్ లోపెజ్.. ఆ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టారు. ఈ పాపులారిటీతో నెమ్మదిగా సినిమా అవకాశాలు ఆమెకు క్యూకట్టాయి. సెలెనా, ఫిల్మ్ ఆఫ్ ది సేమ్ నేమ్ చిత్రాలతో అత్యధిక పారితోషికం తీసుకునే లాటిన్ నటిగా పేరు గడించారు. ఆ తర్వాత అనకొండ, ఔట్ ఆఫ్ సైట్, ఆన్ ది 6 వంటి సినిమాలు ఆమెకు నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

Photo Courtesy: Jennifer Lopez/Youtube
విడాకులు, ఎఫైర్స్‌తో హల్‌చల్
ఇక జెన్నీ పెళ్లిళ్లు, ప్రేమాయణాల సంగతి చూస్తే.. తొలుత డేవిడ్ క్రూజ్‌తో ఎఫైర్ నడిపింది. ఆ తర్వాత క్యూబాకు చెందిన ఓజాని నోవాను పెళ్లాడి ఏడాది తిరిగేసరికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత పాప్ సింగర్ సియాన్ కాంబ్స్‌తో కొంతకాలం తిరిగింది. క్రిస్ జూడ్‌ను పెళ్లాడి రెండేళ్లకే విడాకులు ఇచ్చింది. అనంతరం మార్క్ ఆంటోనీని పెళ్లాడి పదేళ్లపాటు సజావుగానే కాపురం చేసింది. తర్వాత బెన్ అఫెక్‌ను పెళ్లాడి.. ఈ ఏడాది ప్రారంభంలో విడాకులు ఇచ్చింది. అఫ్లెక్‌తో విడాకుల కోసం ఏకంగా 900 కోట్ల రూపాయలను భరణంగా కోరడం హాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది.
56 వయసులోనూ సెగలు
15 ఏళ్ల కిందట వానిటీ ఫెయిర్ అనే మ్యాగజైన్‌కు నగ్నంగా ఫోజులు ఇచ్చి సంచలనం సృష్టించింది. వానిటీ ఫెయిర్ మీద నాకున్న అభిమానంతోనే ఇలా చేయడానికి ఒప్పుకున్నానని జెన్నీ తెలిపారు. తాను ప్రేమను నమ్ముతానని, ఎప్పుడూ ప్రేమించాలి అనేది నా కల అని ఆమె వెల్లడించారు. 56 ఏళ్ల వయసులోనూ చూపు తిప్పుకోనివ్వని అందంతో సెగలు రేపుతున్న జెన్నిఫర్ లోపెజ్ ప్రపంచవ్యాప్తంగా కచేరీలు నిర్వహిస్తూ సంగీత ప్రియులను అలరిస్తున్నారు.
జారిపోయిన డ్రెస్
తాజాగా అప్ ఆల్ నైట్: లైవ్ ఇన్ 2025 పేరుతో పోలాండ్‌లోని వార్సాలో ఉన్న పీజీఈ నారోడేవి స్టేడియంలో భారీ కన్సర్ట్ నిర్వహించింది. ఈ సందర్భంగా లోపెజ్ కు ఊహించని చేదు అనుభవం ఏదురైంది. తన 56వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారు. అభిమానులు తన పాటకు కోరస్ పాడుతుండగా.. సంతోషంగా స్టేజ్‌పై స్టెప్పులు వేస్తున్నారు జెన్ని. ఈ దశలో ఆమె ధరించిన గోల్డ్ కలర్ మినీ స్కర్ట్ జారిపోయింది. దీంతో ఆమె లోపల వేసుకున్న అండర్‌వేర్ కనిపించింది. ఊహించని ఈ పరిణామంతో తొలుత షాకైనా తర్వాత తన చేతులను అడ్డు పెట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ కుదరకపోవడంతో తాను మామూలుగా అయితే అండర్ వేర్ కూడా వేసుకోనని.. ఈరోజు ఎందుకో వేసుకున్నానని చాకచక్యంగా వ్యవహరించింది. అలాగే ఈ స్కర్ట్ నాకు వద్దని మీరే తీసుకోవాలంటూ గాల్లోకి విసిరేసింది. ప్రస్తుతం జెన్నిఫర్ లోపెజ్ కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











