ధనుష్‌తో వివాదం : ట్విట్టర్ అకౌంట్ డిలీట్, అజ్ఞాతంలోకి నయనతార భర్త?
ప్రస్తుతం సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్‌స్టార్ నయనతారల వివాదం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తన పెళ్లి డాక్యుమెంటరీ తెరకెక్కించేందుకు 3 సెకన్ల క్లిప్ వాడుకుంటామని అడిగినందుకు ధనుష్ తమను రూ. 10 కోట్లు డిమాండ్ చేశారంటూ నయన్ బట్టబయలు చేయడం కలకలం రేపింది. దీంతో వ్యవహారం కాస్త కోర్టు వరకు చేరడంతో మాంచి రంజుగా మారింది. ఈ నేపథ్యంలో నయనతార సోషల్ మీడియాలో వరుసపెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది.
కోలీవుడ్ క్వీన్, లేడీ సూపర్‌స్టార్ నయనతార .. విఘ్నేశ్ శివన్‌ల పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి వీడియో, ఇతర ఫుటేజ్‌ను నయన్ .. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు భారీ రేట్‌కు విక్రయిచారు. ఈ ఫుటేజ్ ఆధారంగా నెట్‌ఫ్లిక్స్.. బియాండ్ ది ఫెయిరీటేల్ అనే పేరిట డాక్యుమెంటరీని రూపొందించింది. దీనిని నవంబర్ 18న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీ ఇంత ఆలస్యం కావడానికి హీరో ధనుష్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాదాపు 3 పేజీల లేఖ రాసి సంచలన ఆరోపణు చేసింది లేడీ సూపర్‌స్టార్.

నిజానికి నయనతార - విఘ్నేష్‌ల ప్రేమ కథ మొదలైంది నయన్ - ధనుష్ నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమా సమయంలోనే. ఈ చిత్రానికి విఘ్నేష్ దర్శకుడు. తమ జీవిత ప్రస్థానంలో ఎంతో కీలకమైన ఈ సినిమాలోని పాటలు, కొన్ని దృశ్యాలు వినియోగించుకోవడానికి నయన దంపతులు ఆ చిత్ర నిర్మాత ధనుష్‌ను అనుమతి కోరారు. అయితే ఆయన అందుకు అవకాశం ఇవ్వకపోవడం వివాదాస్పదమైంది. దీంతో సినిమాలోని క్లిప్స్ కాకుండా బిహైండ్ ది సీన్స్‌లోని తమ వ్యక్తిగత కెమెరాలలో తీసుకున్న విజువల్స్‌ని మూడు సెకన్ల పాటు డాక్యుమెంటరీలో వినియోగించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధనుష్ కాపీ రైట్ యాక్ట్ కింద రూ. 10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలంటూ నోటీసులు పంపారు.
ధనుష్ కాకుండా మిగిలిన ఇండస్ట్రీల ప్రముఖులు ఈ డాక్యుమెంటరీకి సహకారం అందించడంతో వారందరికీ నయనతార ధన్యవాదాలు తెలిపారు. తాజాగా కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసిన పనికి వడ్డీతో సహా తిరిగి వస్తుందంటూ మరో ఘాటు పోస్ట్ పెట్టింది. తొలుత చూసి చూడనట్లుగా ఉన్న ధనుష్ కోర్టు ద్వారా నయన్ దంపతులపై కోర్టు ద్వారా నోటీసులు జారీ చేశాడు. ఈ క్రమంలో విఘ్నేష్ శివన్ సైలెంట్ కావడం , ఏకంగా తన ఎక్స్ ఖాతాను డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది.

కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విఘ్నేష్.. తాను అజిత్ నటించిన ఎన్నై అరిందాల్ మూవీ కోసం పాట రాశారని.. సరిగ్గా ఆ సమయంలోనే తన తొలి సినిమా నానుమ్ రౌడీదాన్ చూసి మెచ్చుకున్నారని చెప్పాడు. ఇక్కడే విఘ్నేష్ ధనుష్ అభిమానులకు దొరికిపోయాడు. నానుమ్ రౌడీదాన్ రిలీజ్ కావడానికి 7 నెలల ముందే అజిత్ సినిమా విడుదలైందని.. అలాంటప్పుడు అజిత్ ఎలా చూసి మెచ్చుకున్నారని విఘ్నేష్‌ను ట్రోల్ చేశారు. దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన ధనుష్ పట్ల ఆయనకు కృతజ్ఞత లేదని మండిపడ్డారు. ఈ ట్రోలింగ్ దెబ్బకు విఘ్నేష్ శివన్ తన ఎక్స్ ఖాతాను డిలీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











