Taraka Ratna: కీలక నిర్ణయం తీసుకున్న కల్యాణ్ రామ్.. ఫ్యాన్స్‌కు నిరాశే కానీ..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఈ కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలుగా పరిచయం అవడమే. అయితే, అలా వచ్చిన వారిలో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్లుగా ఎదిగారు. కానీ ఒక్కరు మాత్రం స్టార్‌డమ్ కోసం తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు. ఆయనే నందమూరి కల్యాణ్ రామ్. బడా ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎంతో కష్టపడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న కల్యాణ్ రామ్ విభిన్నమైన చిత్రాలతో సత్తా చాటుతోన్నాడు. తద్వారా పలు విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు.
గత ఏడాది 'బింబిసార' అనే టైం ట్రావెల్ మూవీతో వచ్చిన నందమూరి కల్యాణ్ రామ్.. దీనితో కెరీర్‌లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే కల్యాణ్ రామ్ ఇప్పుడు 'అమిగోస్' అనే ప్రయోగాత్మక చిత్రాన్ని చేస్తున్నాడు. క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇక, ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఇటీవలే అనౌన్స్ చేసేసింది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన దక్కింది.

నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తోన్న 'అమిగోస్' మూవీ ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఈరోజు (జనవరి 28) ఈ చిత్రం నుంచి 'ఎన్నో రాత్రులొస్తాయి కానీ' అనే పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పుడు నందమూరి తారకరత్న ప్రాణాల కోసం పోరాడుతోన్న నేపథ్యంలో ఈ పాటను జనవరి 29న విడుదల చేస్తున్నట్లు తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో 'తారకరత్న గారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. ఎన్నో రాత్రులొస్తాయి పాటను తర్వాతి రోజుకు వాయిదా వేస్తున్నాం' అని తెలిపింది.

క్రేజీ కాన్సెప్టుతో వస్తున్న 'అమిగోస్' మూవీలో కల్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తున్నాడు. ఇందులో అతడికి జోడీగా అషికా రంగనాథ్ నటిస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











