Amigos Trailer: బింబిసార తరువాత కళ్యాణ్ రామ్ త్రిబుల్ యాక్షన్.. మరో సరికొత్త ప్రయోగం!
బింబిసార సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా తన మార్కెట్ ను కూడా 50 కోట్లకు తీసుకువెళ్లాడు. ఇక అతని నుంచి తదుపరి సినిమా ఏ విధంగా ఉంటుంది అనే విషయంలో కూడా ప్రేక్షకుల్లో కొంత అంచనాలను పెంచాడు. అయితే ఊహించని విధంగా ఈసారి మరో అద్భుతమైన ప్రయోగంతో కళ్యాణ్ రామ్ సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో నటించిన అమిగోస్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. అందులో నందమూరి కళ్యాణ్ రామ్ 3 విబిన్నమైన పాత్రలలో ఆకట్టుకోబోతున్నాడు. అయితే ఈ ట్రైలర్లో ఒకే పోలికతో కలిగిన ముగ్గురు ఎదురుపడితే ఎలా ఉంటుంది అలాగే ఊహించని విధంగా ఒకరికొకరు శత్రువులుగా మారితే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ తో రాబోతున్నట్లు ట్రైలర్ లోనే ఒక వివరణ ఇచ్చారు.

ఇక ఇందులో మూడు విభిన్నమైన పాత్రలలో కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటిచినట్లు తెలుస్తోంది. కేవలం కామెడీ ఫ్యామిలీ డ్రామా మాత్రమే కాకుండా మంచి యాక్షన్ ఎపిసోడ్స్ కూడా హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కన్నడ బ్యూటీ ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలకృష్ణ ఓల్డ్ సాంగ్ 'ఎన్నో రాత్రులు వస్తాయి గాని..' అనే పాటను కూడా ఇందులో అద్భుతంగా రీమిక్స్ చేశారు.
ఇదివరకే విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సినిమా ట్రైలర్ కూడా ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమాను ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రారెడ్డి దర్శకత్వం వహించాడు. ఇక జీబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాలో బ్రహ్మాజీ సప్తగిరి మరికొంతమంది ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రలలో నటించారు. మరి ఈ సినిమా నందమూరి కళ్యాణ్ కు బింబిసార రేంజ్ లో సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











