twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    16న కృష్ణంరాజు కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్న అమిత్ షా

    |

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 16, 17 తేదీల్లో హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. తెలంగాణ విమోచ‌న వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొనేందుకు ఆయ‌న హైద‌రాబాద్ వ‌స్తున్నారు. 16 సాయంత్రం ప్ర‌ముఖ న‌టుడు కృష్ణంరాజు ఇంటికి వెళ్లి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శిస్తారు. అనంత‌రం ప్ర‌భాస్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అవ‌నున్నారు. 17వ తేదీ ఉద‌యం ప‌రేడ్ గ్రౌండ్స్ లో జ‌రిగే విమోచ‌న వ‌జ్రోత్స‌వాల‌కు హాజ‌రై జాతీయ జెండాను ఆవిష్క‌రిస్తారు.

    కొద్దిరోజుల క్రితం మ‌నుగోడు స‌భ‌లో పాల్గొనేందుకు హైద‌రాబాద్ వ‌చ్చిన అమిత్ షా సినీ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ప్ర‌భాస్‌తో భేటీ కానున్నారు. ఇందులో ఎటువంటి రాజ‌కీయ కోణం లేద‌ని, పెద‌నాన్న మృతితో బాధ‌లో ఉన్న ప్ర‌భాస్‌ను ప‌రామ‌ర్శిస్తార‌ని, అంతేకాకుండా కృష్ణంరాజు త‌మ పార్టీనేతేన‌ని, ఆయ‌న మృత‌దేహంపై పార్టీ జెండాను కూడా ఉంచామ‌ని బీజేపీ నేత‌లు తెలిపారు.

    Amit Shah to consult Krishnamrajus family members on 16th

    ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణంరాజు బీజేపీ నేత‌గా మృతిచెంద‌డం, డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ కావ‌డం, తాజాగా శ్రీ‌రాముడిగా ఆదిపురుష్ లో న‌టించ‌డంలాంటివే కాకుండా ఆ పార్టీకి మ‌రిన్ని రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని, అందుకే ప్ర‌భాస్‌తో భేటీ అని సినీ, రాజ‌కీయ‌ విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విమోచన వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది.

    అధికార టీఆర్ఎస్ కన్నా ధీటుగా ఉండాలనే లక్ష్యంతో భారతీయ జనతాపార్టీ కూడా విమోచన వజ్రోత్సవాలు నిర్వహించడమే కాక కేంద్ర హోంమంత్రే స్వయంగా వస్తున్నారంటే తెలంగాణపై ఆ పార్టీ ఎంతగా దృష్టిసారించిందనే విషయం అర్థమవుతోందని భావిస్తున్నారు.

    Read more about: prabhas krishnamraju amit shah
    English summary
    Amit Shah is coming to Hyderabad to participate in Telangana Liberation Vajrotsava celebrations.In the evening of 16th, famous actor Krishna Raju will go to his house and consult the family members.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X