twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KBC 12తో అమితాబ్ సిద్ధం.. షో ఏ రోజున ప్రారంభమంటే!

    |

    బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 12 సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్నది. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవలే కరోనావైరస్ నుంచి బయటపడి ఈ సీజన్‌కు సంబంధించిన షూటింగులో పాల్గొన్నారు. ఈ షోను సెప్టెంబర్ 28వ తేదీన ప్రారంభించినున్నట్టు సోని టెలివిజన్ ప్రకటించింది. రాత్రి 9 గంటల నుంచి ఈ షో ప్రసారం అవుతుంది. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఈ షోను ప్రసారం చేస్తున్నాం అని ఓ ప్రకటనలో తెలిపింది.

    కరోనా వైరస్ భయాలు వెంటాడుతున్న సమయంలో ఆడియెన్స్ లేకుండానే ఈ షోను షూట్ చేశాం. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ సారి లైవ్ ఆడియెన్స్ ఉండరు అని నిర్వాహకులు తెలిపారు.

    Amitab Bachchans Kaun Banega Crorepati 12 on September 28

    కేబీసీ 12 షూటింగ్ సందర్భంగా చాలా జాగ్రత్తలు తీసుకొన్నాం. తక్కువ మంది సాంకేతిక నిపుణులతో షూటింగగ్ చేశాం. కేబీసీ సెట్‌కు కంటెస్టెంట్లు వచ్చే ముందు వారిని హోటల్‌లో క్వారంటైన్‌కు తరలించాం. అన్ని రకాల పరీక్షలు తీసుకొన్న తర్వాతే వారిని సెట్‌కు తీసుకొచ్చాం అని నిర్వాహకులు వెల్లడించారు.

    2000 సంవత్సరంలో ప్రారంభమైన కేబీసీ నిర్విరామంగా సాగుతూ 12వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటికీ పలు భాషల్లో ఈ షో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాలుగా అమితాబ్ బచ్చన్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

    English summary
    Bollywood super Star Amitab Bachchan's Kaun Banega Crorepati 12 on September 28. The organisers of show told that, This show will broadcast on Septemeber 28th on 9pm onwards and said we have taken precautions amid Coronavirus pandemic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X