కల్కి తర్వాత ప్రభాస్ మూవీలో మరోసారి అమితాభ్.. లీక్ చేసిన నిర్మాత

పాన్ ఇండియా డార్లింగ్ హీరో ప్రభాస్ లేటెస్ట్ గా సెన్సేషనల్ సినిమా "కల్కి 2898 ఎడి" తో తన కెరీర్ లో రెండో అతి పెద్ద గ్రాసర్ ని అందుకున్నాడు. మొదటిగా బాహుబలి 2 సినిమా 1800 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుంటే ఇప్పుడు కల్కి 1000 కోట్లకి పైగా వసూళ్లు అందుకొని కెరీర్ లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం విషయంలో 1000 కోట్ల క్రెడిట్ ని మాత్రం ఒక్క ప్రభాస్ వల్లే వచ్చింది అంటే చాలా మంది ఒప్పుకోవడం లేదు.

సినిమా రిలీజ్ అయ్యాక చాలానే భిన్నాభిప్రాయాలు ప్రభాస్ విషయంలో వచ్చాయి. అసలు సినిమాలో ప్రభాస్ సైడ్ హీరోలా ఉన్నాడని సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నే హీరో అన్నట్టుగా మాట్లాడారు. లాస్ట్ లో కూడా ప్రభాస్ ని కానీ కర్ణుడిగా చూపించకపోయి ఉంటే ఇక హీరో అమితాబ్ బచ్చనే అనే చాలా మందే సోషల్ మీడియాలో చర్చించుకున్నారు.

amitab bachchan song in prabhas the raja saab here is the clarit

దీనితో ఈ రకంగానే బాలీవుడ్ వసూళ్లు కూడా బాగా కలసి వచ్చాయని ఓ టాక్ ఉంది. అయితే ప్రభాస్ అమితాబ్ కి వీరాభిమానిని అని కల్కి ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. ఈ చొరవతోనే అమితాబ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా కూడా కల్కి విషయంలో తాను ఏమి అనలేదు అని సినీ వర్గాల్లో ఓ బజ్ ఉంది. కాగా ఇప్పుడు ఇదే రకంగా ప్రభాస్ మరోసారి అమితాబ్ ని తన తదుపరి సినిమాలో వాడుకోబోతున్నాడు అని కొన్ని రూమర్స్ బయటకి వచ్చాయి.

కాగా ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో ప్రముఖ దర్శకుడు మారుతీ తో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ "ది రాజా సాబ్" కూడా ఒకటి. మరి ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రాధే శ్యామ్ ఫేమ్ రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తుండగా మారుతీ ఈ చిత్రాన్ని ఓ హారర్ డ్రామాగా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలోనే అమితాబ్ ని మరోసారి ప్రభాస్ వాడుకోబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అమితాబ్ నటించిన చిత్రం డాన్ లో సెన్సేషనల్ హిట్ సాంగ్ "కైకే పాన్ బనారస్ వాలా" అంటే తెలియని వారు ఉండరు.

amitab bachchan song in prabhas the raja saab here is the clarit

మరి ఈ సాంగ్ ని థమన్ చేత రీమిక్స్ చేస్తున్నారని టాక్ వైరల్ గా మారింది. ప్రభాస్ ఫ్యాన్ హ్యాండిల్స్ కూడా ప్రచారం చేశారు. కానీ ఈ ఆశలపై నిర్మాత ఎస్ కె ఎన్ నీళ్లు చల్లారు. ప్రచారం అవుతున్న అన్ని వార్తలని ఎస్ కె ఎన్ ఖండిస్తూ అవి ఫేక్ వార్తలు అని తేల్చేసారు. దీనితో ఒక్కసారిగా బాగా ఎగ్జైట్ అయ్యిన రెబల్ ఫ్యాన్స్ అంతా బాగా డీలా పడిపోయారు. కాగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిపే విధంగా రిలీజ్ కి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X