అత్యాచారం తప్పదనుకున్నప్పుడు వెనక్కి పడుకుని ఎంజాయ్ చేయండి.. అమితాబ్ సెన్సేషనల్ కామెంట్స్

ప్రస్తుతం దిశ ఘటన దేశాన్ని కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. దిశ ఘటనకు సంబంధించిన నినాదాలు, నిరసనలు ఎల్లలు దాటిపోతోంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా యావత్ భారతావని గొంతెత్తుతోంది. దిశ దారుణ హ్యతకు నిరసనగా ప్రజలంతా రోడ్లపైకి ఎక్కారు. ఈ ఘటనకు కారణమైన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి లోకం, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఇలా సమాజం మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ దోషులను వెంటనే శిక్షించాలని కోరుతున్నారు.

బాలీవుడ్ ప్రముఖులు సైతం..

బాలీవుడ్ ప్రముఖులు సైతం..

హైదరాబాద్ నగర శివారులో జరిగిన ఈ ఘటన.. దేశం మొత్తం ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనను బాలీవుడ్ ప్రముఖులు సైతం ఖండించారు. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ఈ ఘటనను ఖండిస్తూ.. వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మనిషి రూపంలో ఉన్న ఈ రాక్షసులే అత్యంత హేయనీయం. అమాయకులైన నిర్భయ, ప్రియాంక రెడ్డి.. వారు పడిన బాధ, వారి మరణం లాంటి ఘటనలతోనైనా సమాజం ఒక్కతాటిపైకి వచ్చి.. మరో అమాయకురాలు బలికాక ముందే అలాంటి రాక్షసులను అంతం చేయాలంటూ ఎంతో ఉద్వేగ పూరితంగా సల్మాన్ ట్వీట్ చేశాడు.

Recommended Video

#CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
 కదిలిన టాలీవుడ్..

కదిలిన టాలీవుడ్..

ఈ ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాలు ఆగ్రహంతో ఊగిపోతుండగా.. టాలీవుడ్ కూడా కదలివచ్చింది. చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు దిశ ఘటనపై ఆవేదన చెందుతూ.. ఎమోషనల్ వీడియోలు షేర్ చేశారు. ఇలాంటి వారందరినీ బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. అమ్మాయిలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

తెరపైకి అమితాబ్ వ్యాఖ్యలు..

అత్యాచారం తప్పదనుకున్నప్పుడు వెనక్కి పడుకుని ఎంజాయ్ చేయండి అంటూ అమితాబ్ పాత వ్యాఖ్యలు ప్రస్తుతం తెర పైకి వచ్చాయి. అప్పటి న్యూస్ను రీ ట్వీట్ చేస్తూ..సూపర్ స్టార్స్ ఇలా చెప్తుంటే ఇక అత్యాచారాలు ఎలా ఆగుతాయంటూ మండిపడుతోంది యువత.

నాటి మ్యాగజైన్..

నాటి మ్యాగజైన్..

30 ఏళ్ళ కిందట ‘మూవీ' అనే మ్యాగజైన్ మీద అమితాబ్ అన్న మాటలు ముద్రించారు. ఇంతకీ ఆయనేమన్నాడంటే..అత్యాచారం తప్పదనప్పుడు.. వెనక్కి పడుకొని దాన్ని ఎంజాయ్‌ చేయటమే అంటూ అమితాబ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన్ను ప్రస్తుతం వెంటాడుతున్నాయి. మరి వీటిపై అమితాబ్ రియాక్ట్ అవుతాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X