బద్లా 100 కోట్ల జోష్.. మరో థ్రిల్లర్‌లో అమితాబ్.. సీరియల్ కిస్సర్‌తో కలిసి..
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ బద్లా రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ చిత్రం అందించిన విజయంతో మరో థ్రిల్లర్ మూవీలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించడం గమనార్హం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఆనంద్ పండిట్ తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మీడియాతో మాట్లాడారు.
అమితాబ్ బచ్చన్‌తో నా స్నేహం ఎన్నో ఏళ్లుగా సాగుతున్నది. ఆయనతో సినిమా రూపొందంచడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ వద్ద స్క్రీన్ రైటర్‌గా పనిచేసిన రూమీ జాఫ్రీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లైఫ్ పాట్నర్, గలి గలి చోరీ హై, గాడ్ తుస్పీ గ్రేట్ హో లాంటి చిత్రాలకు రూమీ జాఫ్రీ స్క్రీన్ రైటర్‌గా పనిచేశారు.

అమితాబ్, ఇమ్రాన్ హష్మీ నటించే థ్రిల్లర్ మూవీ మే 10న తొలి షెడ్యూల్‌ను ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి లవ్ రంజన్ మరో నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ చిత్రం కాకుండా అమితాబ్ కెప్టెన్ నవాబ్, బ్రహ్మాస్త్ర, సైరా నర్సింహారెడ్డి, జుంద్, తేరా యార్ హు మై, ఆంఖే 2 సినిమాల్లో నటిస్తున్నారు.
షారుక్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై తాస్పీ పొన్నుతో కలిసి అమితాబ్ నటించిన బద్లా చిత్రం ఇటీవలే 100 కోట్ల మార్కును అధిగమించింది.


Click it and Unblock the Notifications











