దీపిక పదుకోన్ కోసం గొడవ పడ్డ అమితాబ్, ప్రభాస్.. కల్కి ఈవెంట్‌లో ఏం జరిగిందంటే?
రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ జంటగా నటించిన చిత్రం కల్కి 2898 AD. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా గురించిన విశేషాల్లోకి వెళితే..
కల్కి 2898 ఏడీ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ ఈవెంట్‌లో ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు కమల్ హాసన్, రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ పాల్గొన్నారు.

కల్కి మూవీ ఈవెంట్‌లో నటీనటుల ఆడియో విజువల్ ప్రోమోను ప్రదర్శించి వారిని స్టేజ్ మీదకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్టేజ్ మీదకు దీపికను ఆహ్వానించారు. ఆమె ప్రెగ్నెంట్‌గా గర్బంతో మెల్లగా స్టేజ్ మీదకు నడుచుకొంటూ వచ్చారు. ఆమె ఈ సినిమా గురించి మాట్లాడిన తర్వాత ఆమె స్టేజ్ దిగేందుకు ప్రయత్నించారు.
దీపిక పదుకోన్ స్టేజ్ దిగుతుంటే.. ప్రభాస్ వచ్చి ఆమె చేతిని పట్టుకొని మెల్లగా నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఆయన వెనుకే వచ్చిన అమితాబ్ బచ్చన్ మెల్లగా ప్రభాస్‌ను పక్కన జరిపి ఆమె చేయిని అందుకొనేందుకు ప్రయత్నించారు. ఈ సరదా సన్నివేశం అందర్నీ ఆకట్టుకొన్నది.
ఇక మరోసారి అమితాబ్, కమల్, ప్రభాస్, దీపిక పదుకోన్‌ను స్టేజ్‌పైకి పిలిచారు. ఆ సందర్బంగా దీపిక స్టేజ్ పైకి నడుచుకొంటూ వస్తుంటే.. ప్రభాస్ చెయి అందించి సహయం చేస్తుండగా.. అమితాబ్ బచ్చన్ ఆయనతో పోటీ పడ్డాడు. వారిద్దరి చిన్నగా తోసుకొన్నట్టు యాక్ట్ చేశారు. ఇలా చిలిపిగా వారిద్దరి దీపిక కోసం కొట్టుకొన్నట్టు డ్రామా చేశారు.


Click it and Unblock the Notifications











