Pawan Kalyan OG నుంచి అమితాబ్ ఫస్ట్ లుక్ లీక్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
తెలుగు ప్రజల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్లు ఫ్లాప్‌లు అంటూ తేడా లేకుండా ఎలాంటి క్రేజ్ తగ్గని హీరోగా తన సత్తా చాటుతున్నాడు. ఎన్ని ప్లాప్స్ వచ్చినా సరే ఫ్యాన్స్ మాత్రం తగ్గని ఏకైక హీరో ఆయన. పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇందాకే బ్రో మూవీ ట్రైలర్ విడుదల కాగా దానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఆయన నటిస్తున్న మరో క్రేజీ మూవీ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (OG). ఇందులో బాలీవుడ్ దిగ్గజ నటులు నటిస్తున్నారు. దానికి సంబంధించి ఓ న్యూస్ తెగ స్ప్రెడ్ అయి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ విషయంలోకి వెళితే..
పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం బ్రో. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. జూలై 22న సాయంత్ర 6 గంటలకు విడుదలైన ఈ ట్రైలర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక పవన్ కల్యాణ్ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు ఓ టాక్ అయితే నడుస్తోంది. ఇవే కాకుండా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ తో ఓజీ చిత్రాలను లైన్ లో పెట్డాడు పవర్ స్టార్.

పవన్ కల్యాణ్ ఓజీ సినిమాను యంగ్ ఏజ్ లోనే ప్రభాస్ సాహో సినిమాతో బాలీవుడ్ నటీనటులను తెలుగులోకి దింపిన సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. RRR నిర్మాత డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ OG సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైన ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ క్యూట్ బ్యూటి ప్రియాంక అరుళ్ మోహన్ చేస్తోంది.
ఇక పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో విలన్ గా బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అయితే ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నట్లు టాక్ వచ్చింది. ఇందులో పవన్ కల్యాణ్ తండ్రి పాత్రలో ఆయన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ అమితాబ్ బచ్చన్ ఆన్ బోర్డ్ అంటూ అమితాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పోస్టర్ షేర్ చేసిన అకౌంట్ డీవీవీ దానయ్య పేరు మీద ఉండటంతో అంతా నిజం అనుకున్నారు. కానీ, అది ఫేక్ అకౌంట్ అని తెలిసి నెటిజన్లు, ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు.


Click it and Unblock the Notifications











