రాధేశ్యామ్ సినిమా కోసం రంగంలోకి లెజండరీ హీరో.. సినిమాలో హైలెట్ అయ్యే విధంగా..

రెబల్ స్టార్ ప్రభాస్ గ్లామరస్ హీరోయిన్ పూజా హెగ్డే కలయికలో వస్తున్న రొమాంటిక్ లవ్ అడ్వెంచర్ సినిమా రాధేశ్యామ్ మార్చి 11 విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. కానీ ఈసారి రాధేశ్యామ్ సినిమాతో మాత్రం తప్పకుండా అందరికీ ఒక విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే బాలీవుడ్ లో ఈ సినిమా కోసం ఒక లెజెండ్ హీరో వాయిస్ ఓవర్ అయిపోతున్నట్లు గా క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా..

ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా..


డిఫరెంట్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా అన్ని భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల అవుతోంది.
ప్రభాస్ ఎంతో ఇష్టంగా చేసిన రాధేశ్యామ్ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాడు. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా చాలా సార్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా కరోనా కారణంగా షూటింగ్ కు అనేకసార్లు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా ఆ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సినిమా సినిమాను అనుకున్నట్లుగానే పూర్తి చేశారు.

 ఆడియే సూపర్ హిట్

ఆడియే సూపర్ హిట్


భారీ ఖర్చుతో కొన్ని ప్రత్యేకమైన సెట్స్ కూడా నిర్మించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలు అన్నీ కూడా సోషల్ మీడియాలో అలాగే యూట్యూబ్ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే మొదటిసారి చిత్ర యూనిట్ సభ్యులు తెలుగు హింది భాషకు ప్రత్యేకంగా పాటలను రూపొందించడం విశేషం. ఎవరి టేస్ట్ కి తగ్గట్టు గా వారికి నచ్చేలా ఉండాలని సౌత్ ప్రేక్షకులకు ఒక తరహాలో నార్త్ ప్రేక్షకులకు మరొక మ్యూజిక్ ను అందించే ప్రయత్నం చేశారు. మొత్తానికి సినిమా పాటలు అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అత్యధిక థియేటర్స్ లో..

అత్యధిక థియేటర్స్ లో..

ఇక ఈ సినిమాను మార్చి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకి సినిమా విడుదల కాని విధంగా అత్యధిక థియేటర్లలో ప్రభాస్ సినిమా సందడి చేయబోతోంది. ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెర పైకి తీసుకు వస్తున్నారని తెలుస్తోంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా నచ్చుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో వున్నారు.

Recommended Video

Prabhas ప్యాన్ ఇండియా స్టార్ నుండి Universal Star గా మారుతాడు | #PrabhasNagshwin || Filmibeat Telugu
 అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్

అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్

అయితే ఈ సినిమాకు బాలీవుడ్ సూపర్ స్టార్ లెజెండ్రీ యాక్టర్ అమితాబచ్చన్ ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. సినిమా కథ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలి అని ఒక ప్రత్యేకమైన వాయిస్ ఓవర్ హైలెట్ అవుతుందట. సినిమా స్టార్టింగ్ లో అలాగే చివరలో ఆయన ఇచ్చే వివరణ హిందీ భాషలో కూడా ప్రముఖ నటి నటులతో కథకు సంబంధించిన అంశాలను తెలియజేస్తారని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు కూడా అఫీషియల్ గా తెలియజేశారు. మరి సినిమాకు ఆయన వాయిస్ ఓవర్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X