‘సైరా’ న్యూ మోషన్ పోస్టర్: గోసాయి వెంకన్నగా కనిపించేది ఎవరంటే..?

Recommended Video

Amitabh Bachchan Motion Teaser From Syeraa

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లోనే ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్రం ద్వారా అమితాబ్ బచ్చన్ తొలిసారి తెలుగు తెరపై మెరవబోతున్న సంగతి తెలిసిందే. బిగ్‌బి ఇందులో సైరా నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించబోతున్నారు.

అక్టోబర్ 11న అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన ఆయన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అమితాబ్ లుక్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

అమితాబ్ మోషన్ టీజర్

‘సైరా నరసింహారెడ్డి' సినిమా దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం ఇతర భాషల్లో కూడా సినిమాను విడుదల చేయబోతున్నారు.

 హిందీ మార్కెట్ కోసమే అమితాబ్

హిందీ మార్కెట్ కోసమే అమితాబ్

భారీ బడ్జెట్ సినిమా కావడంతో హిందీ మార్కెట్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. అమితాబ్‌ను ఈ సినిమాలో కీలక పాత్రకు తీసుకోవడం వెనక కారణం కూడా అదే అని అంటున్నారు. దీంతో పాటు తమిళం నుండి విజయ్ సేతుపతి, కన్నడ నుండి కిచ్చా సుదీప్ లాంటి వారితో ముఖ్య పాత్రలు చేయించడం కూడా ఆయా మార్కెట్లను దృష్టిలో పెట్టుకునే అని స్పష్టమవుతోంది.

టాప్ టెక్నీషియన్స్

టాప్ టెక్నీషియన్స్

ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇండియాలోని ది బెస్ట్ కెమెరామెన్లలో ఒకరైన ఆయన సైరా నరసింహుడి ఉగ్రరూపం తన లెన్సులో మరింత అద్భుతంగా ఫోకస్ చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ హిందీలో ఉడాన్, వేక్‌ అప్‌ సిద్, ఐషా, దేవ్‌ డి, నో వన్‌ కిల్డ్‌ జెస్సికా, ఇషక్‌ జాదే, ఇంగ్లిష్‌ వింగ్లిష్‌, బాంబే వెల్వెట్‌, ఉడ్తా పంజాబ్‌, క్వీన్ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. తాజాగా సైరా టీజర్‌కు అతడు అందించిన సంగీతం సూపర్బ్ అనేలా ఉంది.

 సైరా నరసింహారెడ్డి

సైరా నరసింహారెడ్డి

2019లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగాస్టార్‌కు అన్ని భాషల సినీ పరిశ్రమల్లోనూ స్నేహితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో వారిని సైతం భాగం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. తెలుగులో బాహుబలి తర్వాత వస్తున్న అతిపెద్ద మూవీ ఇదే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X