twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KBC 14 కోటీశ్వరుడు కావాలనుకొంటున్నావా? అమితాబ్ అడిగే ప్రశ్నకు జవాబు చెప్పగలరా?

    |

    ఇండియన్ టెలివిజన్ చరిత్రలో సుదీర్ఘంగా సాగుతున్న రియాలిటీ షో ఏదైనా ఉందంటే.. అది కౌన్ బనేగా కరోడ్‌పతి మాత్రమే. అత్యంత పాపులారిటీ ఉన్న రియాలిటీ షో 14వ సీజన్‌తో దిగ్విజయంగా ముందుకెళ్తున్నది. ఇండియన్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా సాగుతున్న ఈ షో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం జరుగుతున్నది. ఈ షోలో పాల్గొనడానికి ఔత్సాహికులను రిజిస్ట్రేషన్ చేసుకొమని సోని లివ్ కోరుతున్నది. ఈ షో గురించి వివరాలు, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమాచారంలోకి వెళితే..

    Amitabh Bachchans Kaun Banega Crorepati 14

    కేబీసీ షో విషయానికి వస్తే.. ఈ రియాలిటీ షో ఇటీవలే 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొన్నది. ఈ సీజన్‌కు సంబంధించిన ముందు ఎపిసోడ్స్‌లో ఆయుష్మాన్ ఖురానా, జాన్ అబ్రహం, నీనా గుప్తా, శ్వేతా బచ్చన్, నవ్య నవేలి, సైఫ్ ఆలీ ఖాన్, రాణి ముఖర్జీ, కపిల్ శర్మ, సోనుసూద్, అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి, కత్రినా కైఫ్, రాజ్ కుమార్ రావు, కృతిసనన్, పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ లాంటి ప్రముఖులు వారాంతపు అతిథులుగా పాల్గొన్నారు.

    కౌన్ బనేగా కరోడ్‌పతి 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవడంపై అమితాబ్ స్పందిస్తూ.. ఇప్పటికే 21 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. 2000 సంవత్సరంలో ప్రారంభం కావడం నాకు కొత్త అనుభూతిని పంచింది. 21 ఏళ్లు అప్పుడే గడిచిపోయిందా అనే విషయాన్ని ఆలోచించుకొంటే ఆశ్చర్యం వేస్తుంది. నేను వెండితెర నుంచి బుల్లితెరకు రావడంపై కొందరు అనేక సందేహాలు, అనుమానాలు, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఫిలిం ఇండస్ట్రీ నుంచి టెలివిజన్ ఇండస్ట్రీకి వెళ్లడం వల్ల మీ ఇమేజ్‌ దెబ్బ తింటుందని అన్నారు. అయితే తొలి ఎపిసోడ్ తర్వాత వచ్చిన రెస్పాన్స్‌తో నా నిర్ణయం సరైనదేనని అనిపించింది. ప్రపంచమంతా మారిపోయిందని అప్పుడే అనిపించిందని అమితాబ్ చెప్పారు.

    ఇక సీజన్ 14లో పాల్గొని కోటీశ్వరుడు కావాలంటే.. సోని లివ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించాడు. హిందీ, ఇంగ్లీష్ భాషలో ఒకదానిని ఎంచుకొని.. మీ పేరు.. మీ వయసు, విద్యార్హత, వృత్తి వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఎంట్రీ కోసం అడిగే ప్రశ్నకు సమాధానం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అమితాబ్ ఓ వీడియోలో వెల్లడించాడు.

    English summary
    Amitabh Bachchan's Kaun Banega Crorepati 14 set to start soon. Here is the registration process details are
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X