మోడ్రన్ రుషిగా బిగ్‌బీ.. కేక పెట్టిస్తున్న అమితాబ్ లుక్.. ఏ సినిమా కోసమో తెలుసా?

ఐదు దశాబ్దాలకుపైగా కెరీర్‌లో 70 ఏళ్ల వయసులో కూడా బాలీవుడ్ టాప్ హీరోలకు ధీటుగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సినిమాలు చేస్తున్నారు. విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్నారు. ఏడాదికి రెండు, మూడు భారీ హిట్లతో కెరీర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా అమితాబ్ బచ్చన్ మరో విలక్షణమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా రూమీ జాఫ్రీ దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మీతో కలిసి చెహ్రే అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఆయన తన గెటప్‌ను సోషల్ మీడియాలో రివీల్ చేశారు. మోడ్రన్ రుషిలాగా కొత్త అవతారంలో కేకపెట్టించారు.

నా కెరీర్‌లో మరో విభిన్నమైన సినిమా ప్రారంభమైంది. రూమీ జాఫ్రీ రూపొందించే చెహ్రే సినిమా మొదలైంది. సెట్లో అద్భుతమైన అంకితభావం, అంకుఠిత దీక్ష కనిపిస్తున్నది అని అమితాబ్ ట్వీట్ చేశారు.

అమితాబ్ కొత్త అవతారాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. చెహ్రే సినిమాలోని బిగ్ బీ లుక్ ఇది. దర్శకత్వం రుమీ జాఫ్రీ, నిర్మాత ఆనంద్ పండిట్ అంటూ ట్వీట్‌లోపేర్కొన్నారు.

చెహ్రీ చిత్రంలో కృతి ఖర్బందా, రియా చక్రవర్తి, సిద్దాంత్ కపూర్, ద్రిత్‌మాన్ చక్రవరి, రఘువీర్ యాదవ్, అన్నుకపూర్ తదితరులు నటించారు. ఈ చిత్రం 2020 ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్నది.

Amitabh Bachchans new avataar in Chehre goes viral

ప్యార్ కా పంచనామా2, సర్కార్ 3, సత్యమేవ జయతే, బజార్, టోటల్ ధమాల్ లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించిన ఆనంద్ పండిట్ ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, సినిమాల్లో బిజీగా ఉంటూనే.. బుల్లితెర మీద కూడా తన సత్తా చాటుతున్నారు. బిగ్ బీ హోస్ట్‌గా వ్యవహరించే కేబీసీ 11 త్వరలోనే ప్రారంభం కాబోతున్నది. ఇప్పటికే ఈ రియాలిటీ షో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X