Don't Miss!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- News 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మరో సర్ ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్ టీమ్.. సైన్స్ ఫిక్షన్ సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్
ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న చిత్రాల్లో ప్రభాస్ , నాగ్ అశ్విన్ సినిమా ఒకటి. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఆ సినిమా తెరపైకి రావడానికి ఇంకా సమయం చాలానే ఉన్నప్పటికీ అప్డేట్స్ తో మాత్రం చిత్రం యూనిట్ ఊహించని విధంగా అంచనాలను పెంచేస్తోంది. ఇక అనుకున్నట్లుగానే నేడు అభిమానులకు మంచి కిక్కిచ్చే సర్ ప్రైజ్ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన ప్రధాన పాత్రకపై సస్పెన్స్ వీడింది.
Recommended Video
అమితాబ్ బచ్చన్ లేకుండానా..
ఇండియన్ సినిమా హిస్టారిలో లెజెండ్ గా ఎంతగానో క్రేజ్ అందుకున్న నటుడు అమితాబ్ బచ్చన్. అలాంటి లెజెండ్ లేకుండా ఒక లెజెండరీ సినిమా ఎలా ఉంటుందని చిత్ర యూనిట్ అద్భుతమైన వీడియోను విడుదల చేసింది. ఫైనల్ గా ఒక ముఖ్యమైన పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా స్థాయి మరో లెవెల్ కి చేరింది.
అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు
ఇప్పటికే హీరోయిన్ గా దీపిక పదుకోన్ ని ఫిక్స్ చేసుకున్న చిత్ర యూనిట్ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇక పాన్ ఇండియా సినిమా అనే దానికి అసలైన అర్దాన్ని చెబుతూ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ని కూడా ఫిక్స్ చేసుకోవడంతో అంచనాల డోస్ మరింత పెరిగాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ పాన్ ఇండియా అని కాకుండా అంతకుమించి అనేలా ఎదో చేస్తున్నట్లు చాలా క్లియర్ గా అర్ధమవుతోంది.
అక్టోబర్ 23న మరొక గుడ్ న్యూస్..
ఇక ప్రభాస్ పుట్టినరోజున ఒక అప్డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు మొన్నటివరకు ఒక టాక్ వచ్చింది. ఇక ఇప్పుడే మంచి అప్డేట్ ఇవ్వడంతో అక్టోబర్ 23న మరొక గుడ్ న్యూస్ ఏదైనా చెబుతారా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా ప్రభాస్ కి బర్త్ డే విషెస్ అందించాలి కాబట్టి స్పెషల్ పోస్టర్ ఏమైనా విడుదల చేస్తారేమో అనే టాక్ నడుస్తోంది.
సైన్స్ ఫిక్షన్ అని అప్పుడే అర్థమైంది
ఇక ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాకు పూర్తి కథను సిద్ధం చేసుకున్న నాగ్ అశ్విన్ సినిమా మేకింగ్ లో సహాయం కోసం సింగీతం శ్రీనివాసరావును కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఇక అప్పుడే ఈ సినిమా టైమ్ ట్రావెలింగ్ నేపధ్యంలో తెరకెక్కుతుందని క్లారిటీ వచ్చేసింది. గతంలో సింగీతం బాలకృష్ణతో ఆదిత్య 369 సినిమాతో సరికొత్త వండర్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా మరో వండర్ క్రియేట్ చేస్తున్నాడు. మరి అలాంటి సినిమాలో అమితాబ్ బచ్చన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి.