రమ్యకృష్ణతో అమితాబ్ బచ్చన్ రొమాన్స్!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తొలి తమిళ చిత్రానికి రంగం సిద్ధం అవుతోంది. ఉయర్నత మణిదాన్‌ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమిళ్‌వాణన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అమితాబ్ ఈ చిత్రంలో తన లుక్ ని ఇటీవల విడుదల చేశారు. తమిళనాడు స్టైల్ లో అడ్డా బొట్టు, పంచె కట్టు లుక్ లో అమితాబ్ కనిపిస్తున్నారు. ఇక ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అమితాబ్ బచ్చన్ తో కలసి ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ తన కల నెరవేరిందని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇండస్ట్రీకి వచ్చినప్పటినుంచి అమితాబ్ బచ్చన్ తో నటించాలని అనుకుంటున్నా. ఇన్నాళ్లకు న కోరిక నెరవేరింది. ఈ సంధర్భంగా ఇద్దరికి నేను కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నా. ఈ చిత్రాన్ని నాకు దక్కేలా చేసిన మురుగదాస్ కు, ఈ చిత్రాన్ని ప్రకటించిన రజని సర్ కు కృతజ్ఞతలు అంటూ సూర్య కామెంట్ చేశాడు.

Amitabh Bachchan to romance with Ramya Krishnan in a Tamil movie

తాజాగా మరో ఆసక్తికర విషయం ఈ చిత్రం గురించి వినిపిస్తోంది. ఈ చిత్రంలో అమితాబ్ కు జోడిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తోందట. తమిళ, హిందీ రెండు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. సైనా నరసింహా రెడ్డి, బ్రహ్మాస్త్ర లాంటి చిత్రాల్లో అమితాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X