Thala: సారీ.. డిస్ట్రబ్ చేశాను.. కంటతడి పెట్టిన అమ్మ రాజశేఖర్
ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో దీపా ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాణంలో రూపొందిన సినిమా తల. అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా ఈ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. హీరోయిన్‌గా అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరన్హా,ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 14న విడుదలకు సిద్దమవుతున్న తల మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో అమ్మ రాజశేఖర్ అనూహ్యమైన సంఘటనను ఎదుర్కొని ఎమోషనల్ అయ్యారు. ఆ సంఘటన ఏమిటనే వివరాల్లోకి వెళితే..
మోస్ట్ యాక్షన్, లవ్, రొమాంటిక్ అంశాలతో తల చిత్రం రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఈ సినిమాపై ప్రమోషనల్ కంటెంట్ బజ్ క్రియేట్ చేయడమే కాకుండా భారీ అంచనాలు పెంచింది. అయితే గ్రాండ్‌గా నిర్వహిస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అమ్మ రాజశేఖర్ సృహతప్పి కిందపడిపోయాడు. దాంతో అందరూ కంగారు పడి ఆందోళనకు గురయ్యారు.

హై బీపీ, హైపర్ టెన్షన్ కారణంగా కిందపడిపోయిన అమ్మ రాజశేఖర్‌కు ప్రాథమిక చికిత్స చేశారు. కాసేపు విశ్రాంతి ఇచ్చిన తర్వాత .. కొన్ని మందులు వేసుకొని నార్మల్ అయ్యారు. నీరసంగా కనిపిస్తూనే ఆయన ఉద్వేగంగా, ఎమోషనల్‌గా తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన కుమారుడిని దీవించాలని ఆయన తెలుగు ప్రేక్షకులను అభ్యర్థించారు.
నేను ఎమోషనల్‌గా ఉన్నాను. తల సినిమా తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ నాకు ఓ ఛాలెంజ్. అమ్మ రాజశేఖర్ కనిపించకుండా పోయారనే వారికి ఈ సినిమా సమాధానం అవుతుంది. నా తెలుగు ఆడియెన్స్ థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను. నాకు ఎలా సపోర్టు చేశారో.. నా కుమారుడు రాగిన్ రాజ్‌కు అలాంటి సపోర్ట్ ఇవ్వాలి. మీ నుంచి అలాంటి సపోర్ట్ వస్తుందని నేను ఆశిస్తున్నాను అని అమ్మ రాజశేఖర్ అన్నారు.

తల సినిమా మీ ముందుకు వస్తున్నదంటే.. అందుకు కారణం నిర్మాత శ్రీనివాస్ గౌడ్. ఆయన మేలును ఈ జన్మలో మరిచిపోను. సొంత వారే ఎవరు సహకరించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన నాకు అండగా నిలిచారు. మీ కోసం ఈ సినిమా హిట్ కావాలి. ఇలాంటి మంచి వాళ్లు ఉంటే ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది. ఈ సినిమా బాగా రావడానికి కారణమైన ప్రతీ ఒక్కరికి, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. ఈ వేడుకలో అందర్నీ డిస్ట్రబ్ చేశాను. సారీ అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











